మలింగ రికార్డును బ్రేక్ చేసిన యుజ్వేంద్ర చహల్..!

ఈ ఐపీఎల్ సీజన్లో గెలుపు, ఓటములను పక్కన పెడితే ఆటగాళ్లంతా సరికొత్త రికార్డులను సృష్టిస్తూ పాత రికార్డులను బ్రేక్ చేస్తున్నారు.ఐపీఎల్( IPL ) చరిత్రలో ఈ సీజన్లోనే రికార్డుల జోరు ఊపందుకుంది.

 Yuzvendra Chahal Broke Malinga's Record , Yuzvendra Chahal , Ipl, Rajasthan Roy-TeluguStop.com

రికార్డు బ్రేక్ అవడం ఆలస్యం అవ్వచ్చు కానీ ఎప్పుడో ఒకప్పుడు ఏ రికార్డు అయినా బ్రేక్ అవ్వాల్సిందే.రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ బౌలర్ యుజ్వేంద్ర చహల్( Yuzvendra Chahal ) ఇటీవలే తాజాగా జరిగిన మ్యాచ్లో ఓ అరుదైన రికార్డు సృష్టించి పాత రికార్డులను బద్దలు కొట్టాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో లసిత్ మలింగ( Lasith Malinga ) రెండో స్థానంలో ఉన్నాడు.ప్రస్తుతం ఆ రికార్డును బ్రేక్ చేసి ఆ స్థానాన్ని చహల్ తన పేరిట నమోదు చేసుకున్నాడు.

పంజాబ్ కింగ్స్- రాజస్థాన్ రాయల్స్ ( Punjab Kings- Rajasthan Royals )మధ్య జరిగిన మ్యాచ్లొ అడి ఐపీఎల్ లో 171 అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా చహాల్ చరిత్ర సృష్టించాడు.రాజస్థాన్ బౌలింగ్ కోచ్ గా ఉన్న లసిత్ మలింగ 170 వికెట్ల రికార్డును బ్రేక్ చేశాడు.ఐపీఎల్ చరిత్రలో డ్వేన్ బ్రావో( Dwayne Bravo ) 161 మ్యాచ్లలో 183 వికెట్లు తీసి మొదటి స్థానంలో ఉన్నాడు.ఇక తర్వాత స్థానంలో ఉన్న మలింగ రికార్డును బ్రేక్ చేసి 171 వికెట్లను తీసి చహాల్ రెండవ స్థానంలో ఉన్నాడు.

ఇక బ్రావో రికార్డ్ బ్రేక్ చేయడానికి కేవలం చహాల్ 12 వికెట్ల దూరంలో ఉన్నాడు.అంతేకాదు గత సీజన్లో 27 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు చహాల్.

ఇక ఈ సీజన్ లో బ్రావో రికార్డ్ బద్దలు కొట్టడం పెద్ద కష్టమేమి కాదు.

ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు: 1.డ్వేన్ బ్రావో : 161 మ్యాచ్లలో 183 వికెట్లు.2.యుజ్వేంద్ర చహాల్ : 133 మ్యాచ్లలో 171 వికెట్లు.3.లసిత్ మలింగ: 122 మ్యాచ్లలో 170 వికెట్లు.4.అమిత్ మిశ్రా: 154 మ్యాచ్లలో 166 వికెట్లు.5.ఆర్.అశ్విన్: 186 మ్యాచ్లలో 158 వికెట్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube