రూ.1,700 కడితే చాలు.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సొంతం చేసుకోవచ్చు..

ఈరోజుల్లో చాలానే ఎలక్ట్రిక్ స్కూటర్లు( Electric Scooters ) లాంచ్ అవుతున్నాయి కానీ వాటిని కొనుగోలు చేయాలంటే దాదాపు లక్ష రూపాయలు వరకు డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది.పేద, మధ్య తరగతి వారికి ఈ అమౌంట్ చాలా ఎక్కువ అని చెప్పవచ్చు.

 Yulu Wynn E-scooter Launched At Rs 55555 Can Be Ridden Without Driving License R-TeluguStop.com

అయితే అలాంటి వారి కోసం అందుబాటు ధరల్లో కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి వస్తున్నాయి.వాటిని ఈఎంఐ పద్ధతిలో నెలకు రూ.2 వేల కంటే తక్కువ కడుతూ సొంతం చేసుకోవచ్చు.కాగా ప్రస్తుతం యులు వైన్‌ (Yulu Wynn) ఇ-స్కూటర్ తక్కువ ధరకే సొంతం చేసుకోగల స్కూటర్లలో ఉత్తమంగా నిలుస్తోంది.

ఇది దాని వర్గంలో శక్తివంతమైన స్కూటర్.స్కార్లెట్ రెడ్, మూన్‌లైట్ వైట్ రంగులలో లభిస్తున్న ఈ స్కూటర్ 0.98 kWh బ్యాటరీతో సింగిల్ ఛార్జ్ పై 68 కి.మీ వరకు ప్రయాణించగలదు.ఇది గరిష్టంగా 24.9 kmph వేగాన్ని అందుకోగలదు.ఈ స్కూటర్ తక్కువ దూర ప్రయాణాల కోసం కంపెనీ తయారు చేసింది.దీన్ని కొంటే బెనిఫిట్ ఏంటంటే, దీనిని రైడ్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

దీనికి కీలెస్ యాక్సెస్,( Keyless Access ) స్వాపబుల్ బ్యాటరీ, ఫ్యామిలీ షేరింగ్ ఆప్షన్ ఉన్నాయి.

నెలకు రూ.1,750 చెల్లిస్తూ ఈ బైక్ సొంతం చేసుకోవచ్చు.రూ.6,000 డౌన్ పేమెంట్‌ పెట్టాల్సి ఉంటుంది.ఆ తర్వాత 9.7 శాతం వడ్డీ రేటుతో మూడు సంవత్సరాల పాటు చెల్లించాలి.ఈ స్కూటర్ ధర రూ.55,555 (ఎక్స్-షోరూమ్).భద్రత పరంగా, ఇది డ్రమ్ బ్రేక్‌లు,( Drum Brakes ) డిజిటల్ కన్సోల్( Digital Console ) వంటి ఫీచర్లను కలిగి ఉంది.

ఇది 12-అంగుళాల చక్రాలు, ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుక వైపున ట్విన్ షాక్ సస్పెన్షన్‌తో మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube