ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు సక్సెస్ ఫుల్ హీరోలుగా నిలుపుకోవడానికి చాలావరకు తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు.ఇక అందులో భాగంగానే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా సక్సెస్ ఫుల్ గా నిలవడమే కాకుండా భారీ ఎత్తున విజయం సాధించడం కూడా వాళ్లకు ప్లస్ పాయింట్ గా మారుతుంది.
ఇక ఇప్పుడు యంగ్ హీరోలు సైతం ఒకటి రెండు సక్సెస్ లు రాగానే భారీగా రెమ్యూనరేషన్ లు( Remuneration ) తీసుకుంటూ సినిమాలను చేసే ప్రయత్నంలో ఉన్నారు.ఇక అందులో భాగంగానే వాళ్లు చేసే సినిమాలా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వచ్చిన ప్రతి ఆఫర్ ని ఓకే చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇక దానివల్ల వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారనే చెప్పాలి.

ఇక ఈ విషయంలో యంగ్ హీరోలు అందరూ నానిని( Nani ) ఆదర్శం గా తీసుకొని ముందడుగు వేస్తే బాగుంటుందని పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఎందుకంటే నాని సినిమా సినిమాకి మధ్య వేరియేషన్ చూపిస్తూ చాలా మంచి డైరెక్టర్స్ ని ఎంచుకుంటున్నాడు.అలాగే కథాపరంగా కూడా తను చాలా శ్రద్ధ తీసుకుంటూ దర్శకులతోపాటు సినిమాని ముందుండి నడిపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే నాని లాంటి హీరో సినిమా సినిమాకి తన మార్కెట్ ను భారీగా విస్తరించుకుంటున్నాడు.మిగిలిన యంగ్ హీరోలకి( Young Heroes ) నానికి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే నాని తన బాడి లాంగ్వేజ్ కు సరిపడ కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

కానీ కొంతమంది యంగ్ హీరోలు మాత్రం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.అసలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి ఎలాంటి కథలు సెట్ అవుతాయి.ఎలాంటి కథలను సినిమాలుగా చేస్తే వారిని ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయంలో అసలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకు సాగడం అనేది వాళ్ళ కెరియర్ కి చాలా వరకు మైనస్ అవుతుంది… కాబట్టి ఇప్పటికైనా యంగ్ హీరోలు నాని ని చూసి నేర్చుకుంటే మంచిది…
.