ఈ మధ్య కాలంలో అధికార పార్టీ వైసీపీలో సొంత ఎంపీ అయిన రఘురామ కృష్ణంరాజు వ్యవహార శైలి కొంత వివాదాస్పదంగా మారుతుంది.మొదటి నుంచి పార్టీ అధిష్టానం నిర్ణయాలకి వ్యతిరేకంగా సొంత ఎజెండాతో వెళ్ళే రఘురామకృష్ణంరాజు ఈ మధ్య కాలంలో అధిష్టానంతో మరింత గ్యాప్ మెయింటేన్ చేస్తున్నాడా అంటే అవుననే మాట పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
అధికార పార్టీ నిర్ణయాలకి వేలెత్తి చూపిస్తూ వాటిపై తనదైన శైలిలో షూటింగ్ ఈ ఎంపీ విమర్శలు చేస్తున్నారు.తాజాగా ఏపీ రాజకీయాలలో ఈఎస్ఐ స్కామ్ లో టీడీపీ నేత అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయడం, ఆయనను పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబును అనుమతించకపోవడం వంటి ఘటనలు సంచలనంగా మారాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్టంరాజు సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ మీడియా చానల్ లో మాట్లాడుతూ అచ్చెన్నాయుడుని గోడ దూకి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందేనని, ఇంత దారుణంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని చెప్పారు.అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదని అభిప్రాయపడ్డారు.అచ్చెన్నను అరెస్ట్ చేయబోతున్న సంగతి జగన్ కు తప్ప మరెవరికీ తెలియదని అన్నారు.రోజుకొక టీడీపీ నేత అరెస్ట్ అవుతారంటూ రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.
మంత్రుల వ్యాఖ్యల వల్ల టీడీపీ నేతలను కావాలనే అరెస్ట్ చేస్తున్నారని ప్రజలు అనుకునే అవకాశం ఉందని చెప్పారు.కొందరు వైసీపీ నేతల అత్యుత్సాహం వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని అన్నారు.
అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు చంద్రబాబును అనుమతించకపోవడం కూడా సరైంది కాదని ఇది మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పారు.మరి అసలే అధికార పార్టీ పరువు ఇష్యూగా తీసుకునే ఈ ఘటనలో రఘురామకృష్ణంరాజు పార్టీ నేతలపై చేసిన విమర్శలని అధిష్టానం ఇలా తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.