మనలో చాలా మందికి ఎంఆర్ఐ స్కానింగ్ గురించి పరోక్షంగానో, ప్రత్యక్షంగానో తెలిసే ఉంటుంది.అనారోగ్యం పాలైనప్పుడు శరీరంలోని ఏ భాగం అయితే అనారోగ్యం చెందిందో ఆ భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్ట్ ఇచ్చే యంత్రమే ఎంఆర్ఐ స్కాన్.
ప్రస్తుతం ఈ స్కాన్ జరిపించాలంటే ఆసుపత్రులు అయినా సరే, అలాగే డయాగ్నస్టిక్ సెంటర్ అయినా సరే తక్కువలో తక్కువగా 2500 నుండి 4000 రూపాయల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.అందుకే కొందరికి డాక్టర్లు ఎమ్మారై స్కానింగ్ కచ్చితంగా చేయించాలంటే వారి గుండె కాస్త లబోదిబోమంటుంది.
అలాంటి అంత రేటు ఉన్న ఎంఆర్ఐ స్కాన్ ఇప్పుడు కేవలం 50 రూపాయలకే చేయబోతున్నారు.ఈ సంవత్సరం చివరి నెల నుండి ఈ కొత్త ధరలు అందుబాటులోకి రాబోతున్నాయి.
అయితే ఇది కేవలం ఢిల్లీ ప్రాంతం లోనే జరుగుతుంది.గురుద్వారా బంగ్లా సాహిబ్ దగ్గర ఈ ఫెసిలిటీ అందించబోతున్నారు.
ఈ స్కానింగ్ ధర దేశంలోనే అత్యంత చౌకగా చేస్తున్నట్లు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ తెలియజేసింది.ఇక ఇందుకు సంబంధించి ఢిల్లీలోని గురుద్వారా ఆవరణలో ఉన్న గురు హరికృష్ణ హాస్పిటల్ దగ్గర ఈ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలియజేశారు.
ఇకపోతే ఈ ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ కోసం భక్తులు 6 కోట్ల విలువైన విరాళాలు ఇచ్చారని కమిటీ యాజమాన్యం తెలిపారు.ఇక్కడ కేవలం ఎంఆర్ఐ స్కానింగ్ మాత్రమే కాకుండా… డయాలసిస్ కూడా కేవలం 600 రూపాయలకు మాత్రమే తీసుకుంటున్నట్లు తెలియజేశారు.
భక్తులు ఇచ్చిన విరాళాలలో మొత్తం 4 యంత్రాలు డయాలసిస్ చేస్తాయని తెలియజేశారు.వీటితోపాటు ఎంఆర్ఐ స్కానింగ్ చేయడానికి ఒక యంత్రం, అలాగే అల్ట్రాసౌండ్, ఎక్స్ రే నిర్వహించడానికి మరొకటి కొనుగోలు చేసినట్లు తెలియజేశారు.
అల్ట్రాసౌండ్ ఎక్స్ రే లాంటి వాటిని కేవలం 150 రూపాయలు మాత్రమే సేవలు అందిస్తామని వారు తెలియజేశారు.ప్రస్తుతం ఇది కేవలం ఢిల్లీలో మాత్రమే ఉంది కాబట్టి… అక్కడి ప్రజలకు మాత్రమే ఈ సదుపాయం అందుతూనే అదే సదుపాయం మిగతా రాష్ట్రాల్లో కూడా అంతే అనేకమందికి ఎంతగానో ఉపయోగపడుతుంది.