మహిళల బ్రెయిన్‌కి సూపర్ పవర్.. 50 ఏళ్ల కిందటి మాటలూ మర్చిపోరు: స్టడీ!

మహిళల కంటే పురుషులు తెలివైన వారని చాలా మంది అనుకుంటారు కానీ అది అబద్ధమని ఇప్పటికే పరిశోధకులు తేల్చారు.తాజాగా ఇదే విషయాన్ని నార్వేకు చెందిన పరిశోధకులు కూడా మరోసారి తమ పరిశోధనలో నిరూపించారు.

 Women's Brains Have Super Power They Don't Forget The Words Of 50 Years Ago St-TeluguStop.com

వారు చేసిన అధ్యయనంలో పురుషుల్లో కంటే మహిళల మెదడు వేగంగా, చురుకుగా పనిచేస్తుందని తేలింది.అలానే మహిళలు 50 ఏళ్ల కిందట మాట్లాడిన మాటలను కూడా మర్చిపోరని వీరు తమ అధ్యయనంలో కనుగొన్నారు.

వారి జ్ఞాపక శక్తి సామర్థ్యాన్ని తెలుసుకుని వారు కూడా ఆశ్చర్యపోయారట.

వివరాల్లోకి వెళితే ఇటీవల నార్వేలోని బెర్గిన్‌ యూనివర్శిటీ పరిశోధకులు మెదడు చురుకుదనం, ఆలోచనా విధానం, జ్ఞాపకశక్తి సామర్ధ్యంపై ఒక స్టడీ నిర్వహించారు.

ఈ స్టడీ కోసం వారు కొన్నేళ్ల కిందటి నుంచి ఇప్పటి వరకు పురుషులు, స్త్రీల మైండ్ డేటా సేకరించారు.వీరు మొత్తంగా 3.50 లక్షల మంది ప్రజల మైండ్ స్కిల్స్ డేటా సేకరించి వాటిని విశ్లేషించారు.ఈ విశ్లేషణలో మహిళలకు అనర్గళంగా మాట్లాడే స్కిల్స్ ఎక్కువ అని తేలింది.

మేధో నైపుణ్యాల్లో మగవారు మహిళల మధ్య తేడా లేదని.కాకపోతే స్త్రీల జ్ఞాపకశక్తి పురుషుల కంటే చాలా మెరుగ్గా ఉంటుందని వీరి అధ్యయనంలో వెల్లడైంది.

ఒక పర్టిక్యులర్ లెటర్ లేదా నంబర్‌తో స్టార్ట్ అయ్యే పేర్లు, పదాలను కనిపెట్టడం, గుర్తుంచుకోవడంలో మహిళలు పురుషుల కంటే మెరుగ్గా ఉంటారని తేలింది.

Telugu Brain, Norway-Latest News - Telugu

ఆడవారి బ్రెయిన్‌లోని కార్టెక్స్, లింబిక్ సిస్టమ్‌లో బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉండటం వల్ల వారి మెదడు పురుషుల కంటే మరింత యాక్టివ్‌గా ఉంటుందని నార్వే పరిశోధకులు తెలిపారు.ఇక మిగతా అధ్యయనాల్లో మహిళలు ముఖాలు గుర్తించడంలో మగవారికంటే ముందుంటారని వెల్లడైంది.అలానే వీరు వాసన పసిగట్టడంలో, వాసనను గుర్తించడంలో పురుషులతో పోలిస్తే పైచేయి సాధిస్తారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube