అమెరికా మహిళా ప్రాణం తీసిన 'జలనేతి పాత్ర'

అమెరికాలోని సియాటిల్ నగరానికి చెందిన ఒక మహిళ తనకి ఉన్న సైనస్ సమస్యని తప్పించుకోవడానికి యోగాసనాలలో ముఖ్యమైన జలనేతి పాత్ర పద్దతిని పాటించింది.అయితే కొంత కాలానికి ఆమె మెదడుకి ఓ జబ్బు సోకి మరణించింది.

 Woman Dies From Jal Neti Aasan In America-TeluguStop.com

దాంతో ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా ఈ జలనేతి పాత్ర ఆసనంపై తీవ్ర చర్చ జరుగుతోంది.వివరాలలోకి వెళ్తే.

యోగాలో భాగంగా సియాటిల్ కి చెందిన ఒక మహిళ తన సైనస్ సమస్యని పోగొట్టుకోవడం కోసం కొన్ని రకాల ఆసనాలని అవలంభించడం ప్రారంభించింది అయితే అందులో భాగంగా జలనేతి విధానం ద్వారా ముక్కు ఒక భాగం ద్వారా నీటిని వదిలి మరో భాగం ద్వారా ఆ నీటిని వచ్చేలా చేయడం.దాంతో ఈ విధానం ద్వారా బాలముతియా

మాండ్రిలాస్ అనే మెదడును తినివేసే అరుదైన బ్యాక్టీరియా ఆమె మెదడులో చేరి ఆమె ప్రాణాలు పోయేలా చేసింది.

బాలముతియా మాండ్రిలాస్ బ్యాక్టీరియాని 1986లో గుర్తించిన తర్వాత ఇప్పటిదాకా కేవలం 200 కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి తాజాగా ఇప్పుడు ఈ కేసు నందు అయ్యిందని వైద్యులు తెలిపారు.అయితే ఈ బ్యాక్టీరియా జలనేతి పాత్ర ద్వారా మెదడులోకి ప్రవేశించి ఉంటుందని ఆయన వైద్యులు తెలిపారు.ఎందుకంటే ముక్కులో మెదడు దిగవ నాడీకణాలు సులభంగా అందుబాటులో ఉంటాయి.దాంతో ఆమె చేసిన ఈ ప్రయోగం ద్వారా ఆమె తన ప్రాణాలని కోల్పోయింది అందుకే యోగాసనాలు అనుభవజ్ఞులైన నుపుణుల సలహాల ద్వారా పాటించాలని అంటుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube