వేసవికాలం( summertime ) వచ్చిందంటే నీటి కొరత ఎంత దారుణంగా ఉంటుందో అందరికీ తెలిసిందే.ముఖ్యంగా ఉద్యానవన తోటలకు, కూరగాయ తోటలకు నీటి అవసరం చాలా ఎక్కువ.
కాబట్టి చాలామంది డ్రిప్ విధానం ( Drip method )ద్వారా పంట పొలాలకు నీరు అందిస్తున్నారు కానీ అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పుల కాలంలో బోర్లు ఎండిపోతే.పండ్ల తోటలను, పూల తోటలను, కూరగాయ తోటలను సంరక్షించుకోవడం చాలా కష్టం.
అయితే అలాంటి పరిస్థితులలో కూడా ఈ పంటలను సంరక్షించుకోవడం కోసం భూగర్భ డ్రిప్ విధానం ద్వారా నీటిని అందించాలి.అంటే నేల మీద నీరు పారించకుండా నేరుగా చెట్ల వేర్లకే నీటి తడి అందించడం.

సాధారణ డ్రిప్ భూమిపైనే నీటిని వదులుతుంది.అలాకాకుండా భూగర్భ డ్రిప్ మొక్కల( Underground drip plants ) వేర్ల దగ్గర భూగర్భంలో నీటి తేమను అతి పొదుపుగా వదులుతుంది.సాధారణ ఆన్ లైన్ డ్రిప్ లేటరల్ వైపుకు ఉండే డ్రిప్పర్ను తొలగించి స్వర్ భూగర్భ డ్రిప్ బాక్స్ లను అమర్చాలి.ఈ డ్రిప్ బాక్స్ కు సన్నని బెజ్జాలు చాలా ఉంటాయి.5mm మైక్రో ట్యూబ్ తో ఒక చివరన ఈ బాక్స్ జోడించి, మరో చివర భూమి పైన ఉండే డ్రిప్ లెటరల్ పైపులను అమార్చాలి.ఆ తర్వాత డ్రిప్ బాక్స్ ను చెట్టు దగ్గర మట్టిని తవ్వి భూమి లోపల వేర్లకు దగ్గరగా ఉండేటట్టు పెట్టి, మట్టి కప్పేయాలి.
ఈ డ్రిప్ బాక్స్ లో క్వార్ట్ స్టోన్ గ్రాన్యూల్స్( Quart stone granules ) ఉంటాయి.ఇవి నిరంతరం నీటి తేమను వేరు వ్యవస్థకు అందిస్తాయి.

ఈ భూగర్భ డ్రిప్ విధానం ద్వారా సగానికి పైగా నీరు ఆదా అవడంతో పాటు దాదాపుగా 30% వరకు కరెంట్ ఖర్చు ఆదా అవుతుంది.పైగా ఈ విధానం ద్వారా నీటిని అందిస్తే కలుపు సమస్య కూడా తక్కువగా ఉంటుంది.వేసవికాలంలో చాలా అంటే చాలా తక్కువగా నీటి వనరులు ఉంటే భూగర్భ డ్రిప్ విధానం ద్వారా నీటిని అందించి పంటను సంరక్షించుకొని అధిక దిగుబడి పొందవచ్చు.