విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నా గీత గోవిందం మరియు డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించి మెప్పించారు.ఆ తర్వాత కూడా వీరిద్దరి స్నేహం కొనసాగుతూనే ఉంది.
ఇద్దరూ ఒకరు ఉంటే ఒకరు చాలా అభిమానించుకున్నట్లుగా, ఆరాధించుకుంటున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది.విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో చాలా సందర్భాల్లో రష్మిక కనిపించింది.
అంతే కాకుండా విజయ్ దేవరకొండ సినిమా ల విషయం లో రష్మిక చాలా ఆసక్తి చూపించడం.ఆమె సినిమాల్లో నటించిన సమయం లో విజయ్ దేవరకొండ కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరచడం మనం చూడవచ్చు.
ఇద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందని పలు సందర్భాల్లో నిరూపితమైంది.ఆ మధ్య విదేశీ టూర్ కి కూడా ఇద్దరు కలిసి వెళ్లారు.
రష్మిక స్వయంగా ఆ విషయాన్ని ఒప్పుకుంది.విజయ్ దేవరకొండ నాకు ఒక మంచి స్నేహితుడు.
అతడి తో కలిసి టూర్ కి వెళ్తే తప్పేంటి అంటూ మీడియా వారిని ఎదురు ప్రశ్నించింది.

ఇంత ధైర్యం గా టూర్ కి వెళ్లాం అంటూ చెప్పిన రష్మిక మందన్నా ఎందుకు తామిద్దరం ప్రేమ లో ఉన్నాం అంటూ చెప్పలేక పోతుంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.ప్రేమలో ఉన్నప్పుడు ఒప్పుకోవడానికి భయం ఎందుకు.మొహమాటం ఎందుకు అనేది కొందరి ప్రశ్న.
విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉన్నాను అంటూ రష్మిక మందన పేర్కొంటే ఆమె కు అవకాశాలు తగ్గుతాయేమో అనేది కొందరి అభిప్రాయం.

ఆ కారణంగానే ఆమె విజయ్ దేవరకొండ తో ఉన్న రిలేషన్ గురించి అధికారికంగా వెల్లడించడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆమె మాత్రం పదే పదే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంతకు మించి మీడియా వారు మరియు సోషల్ మీడియా జనాలు మాట్లాడుకోవద్దు అంటూ విజ్ఞప్తి చేస్తుంది.ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో అయినా విజయ్ దేవరకొండ రష్మిక లు తమ రిలేషన్ గురించి అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సిందే కదా.అదేదో ముందు క్లారిటీ చేస్తే బాగుండు అనేది అభిమానుల యొక్క అభిప్రాయం.