కోలీవుడ్ నటీమని మహాలక్ష్మి గురించి అందరికీ సుపరిచితమే.ఈమె తమిళ సీరియల్స్ లో అలాగే పలు సినిమాలలోను నటిస్తూ సందడి చేశారు.
అయితే ఈమె ఎప్పుడైతే నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ ను వివాహం చేసుకున్నారో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.అధిక శరీర కాయం కలిగినటువంటి నిర్మాత రవీందర్ ను నుమహాలక్ష్మి కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అంటూ వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడమే కాకుండా ఈ దంపతులను బాడీ షేమింగ్ చేస్తూ భారీగా ట్రోల్ చేస్తూ వచ్చారు.
ఇలా వీరి వివాహం ద్వారా మహాలక్ష్మి వార్తల్లో నిలిచారు.

వీరిద్దరి వివాహం జరిగిన అనంతరం తరచూ వీరికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.అలాగే నటి మహాలక్ష్మికి వివాహం తర్వాత ఎన్నో నగలు చీరల షాపులను ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే వీరికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే మహాలక్ష్మి తాజాగా ఓ చెట్టు పైకి ఎక్కి ఫోటోషూట్ చేయించుకున్నారు.

ఇలా ఈమె ఎక్కిన చెట్టు మరీ పెద్దది కాకుండా నేలకే ఉండడంతో ఈమె చెట్టుపై ఫోటోలకు ఫోజులిచ్చారు.దీంతో ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.ఇక ఈ ఫోటోలు చూసినటువంటి ఎంతోమంది అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.ఈ ఫోటోలలో మహాలక్ష్మి ఊదా రంగు చీర కట్టుకొని ఎంతో అందంగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఈ ఫోటోలు పై కొందరు స్పందిస్తూ అచ్చం దేవకన్యలా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం మహాలక్ష్మికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ వైరల్ గా మారాయి.







