రవాణా రంగ కార్మికులకు వేల్పర్ బోర్డ్ ఏర్పాటు చేయాలి...AIRTWF - CITU డిమాండ్..

రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది స్వయం ఉపాధి మీద ఆధారపడి పని చేస్తున్న రవాణా రంగకార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను సవరిస్తూ విడుదల చేసిన జీవో నెం 25ని గెజిట్ గా మార్చి అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణం వెంకటేశ్వరరావు రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు.స్థానిక మంచి కంటి భవనంలో తెలంగాణ ప్రైవేట్ & పబ్లిక్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (AIRTWF – CITU) ఖమ్మం జిల్లా రెండవ మహాసభలు అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగింది.

 రవాణా రంగ కార్మికులకు వేల్పర�-TeluguStop.com

ఈ మహాసభలో నాయకులు పాల్గొని మాట్లాడుతూ రవాణా రంగంలో పనిచేస్తున్నఆటో, క్యాబ్, ట్రాలీ, ట్రాక్టర్, జీపు, ట్రక్కు, హార్వెస్టర్, స్కూల్ బస్సు, అంబులెన్స్, హైయిర్ బస్, డిసిఎం, మినీ డీసీఎం డ్రైవర్స్ క్లీనర్స్, స్పేస్పార్ట్స్ యజమాన్యం, మెకానిక్స్, ఆపరేటర్స్ తదితరులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.

చదువుకున్న నిరుద్యోగులకు ప్రభుత్వం ఉపాధి కల్పించకపోవడంతో ప్రైవేట్ ఫైనాన్స్లు, బ్యాంకుల నుండిఅప్పు తీసుకొని, వాహనాలు కొనుగోలు చేసి స్వయం ఉపాధి మీద ఆధారపడి పనిచేస్తున్నారు.

ఈ రవాణా రంగకార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు.ఈఎస్ఐ, పిఎఫ్, పనిగంటలు, పని భద్రత లేదు అయినాకార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ప్రజాసేవ చేస్తూ వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఉన్న మాదిరిగా రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుచేసి, సామాజికంగా, ఆర్థికంగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ట్రాన్సోపోర్ట్ రంగంలో 20 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని ఈ వర్కర్ల కనీస వేతనాలుసవరిస్తూ 2021 జూన్ 30వ తేదీన జీఓఎంఎస్ నెం.25 విడుదల చేసింది.ఈ జీఓలో కనీస వేతనంరూ.18,019/-లు, హైస్కిల్డ్ వారికి రూ.39,837/-లుగా నిర్ణయిం ఫైనల్నోటిఫికేషన్ఇచ్చింది.జీఓవిడుదల చేసి 13 నెలలుదాటినాదానిని గెజిట్లో ప్రకటించకుండా యాజమాన్యాల ఒత్తిడితో కనీస వేతనాలు కార్మికులకు,ఉద్యోగులకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఈ విధానాన్ని ఎండగట్టి కనీస వేతనాలు,హక్కులు సాధించటాని ఐక్యంగా కదలాలని పిలుపునిచ్చారుఖమ్మం జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.

అధ్యక్షులుగా తుమ్మ విష్ణువర్ధన్, కార్యదర్శిగా జిల్లా ఉపేందర్, కోశాధికారి డి.ఉపేందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వై.విక్రం, ఉపాధ్యక్షులుగా డి.రాందాస్, వెంకట్ మాధవరావు సహాయ కార్యదర్శిగా అమరయ్య, మహేష్, మరో 20 మందితో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube