ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.చాలా దేశాలు కరువుతో విలవిలలాడుతున్నాయి.
మహమ్మారి కరోనా కట్టడి చేయటానికి ప్రపంచవ్యాప్తంగా దేశాలు తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి.శ్రీలంక ఇంకా పాకిస్తాన్ వంటి దేశాలలో పరిస్థితులు చాలా దారుణంగా మారాయి.
తింటానికి తిండి లేక ప్రజలు ప్రభుత్వాలు ఇచ్చే పథకాలపై ఆధారపడే పరిస్థితి నెలకొంది. చాలా రంగాలు నష్టపోవడం జరిగాయి.
దీంతో ప్రముఖ పేరుగాంచిన వ్యాపార సంస్థలు తమ ఉద్యోగస్తులను అర్ధాంతరంగా ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు.

ఈ తరహా లోనే ప్రముఖ వెబ్ హోస్టింగ్ గోడాడీ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. తన సిబ్బందిలో 8 శాతం మందిని.అంటే 500 మందికి పైగా తొలగిస్తున్నట్లు ప్రకటన చేయడం జరిగింది.
ప్రస్తుత ఆర్థిక పరిణామాల వల్లే ఉద్యోగులను తొలగించడానికి కారణం అనీ గోడాడీ సీఈవో అమన్ భూటాని వెల్లడించారు.ఎక్కువగా యూఎస్ లో సంస్థకు చెందిన ఉద్యోగులపై ప్రభావం పడనుందట.
ఇదే సమయంలో ఉద్యోగాలు కోల్పోతున్న వారికి గోడాడీ సంస్థ పరిహారం కూడా అందిస్తోంది.ఇప్పటికే పలుమార్లు.
సంస్థల ఉద్యోగాలను తొలగించడం జరిగింది.తాజాగా మరోసారి గోడాడీ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.
ఈ పరిణామంతో లేఆఫ్స్ జాబితాలో గోడాడీ కూడా చేరిపోయింది.