మంత్రి అజయ్ కుమార్ పై కాంగ్రెస్, బీజేపీ నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం:- టీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు

నగరంలో ఓ ప్రైవేట్ హోటల్లో జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొత్త వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జేఏసీ చైర్మెన్ బిచ్చల తిరుమలరావు, వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత వారం రోజులుగా ఖమ్మం జిల్లాలో మతోన్మాద రాజకీయాలు జరుగుతున్నాయని, మంత్రి అజయ్ పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దీన్ని టీఆర్ఎస్ లీగల్ సెల్ ఖండిస్తోందన్నారు.

 We Condemn The Remarks Of Congress And Bjp Leaders On Minister Ajay Kumar: - Trs-TeluguStop.com

సాయి గణేష్ మృతి పై మంత్రికీ, టిఆర్ ఎస్ పార్టీకి ఏమి సంబంధం ఆని, సాయి గణేష్ కేసులు కోర్టు పరిధిలో ఉన్నవని వివారించారు.

బీజేపీ మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలి అని చూస్తుందన్నారు.ఇటువంటి రాజకీయాలను ప్రజలు అందరు ఖండించాలని పిలుపునిచ్చారు.

బీజేపీ ప్రభుత్వం పై వ్యతిరేకంగా మాట్లాడితే ఆ ప్రభుత్వాలను కులగొట్టాలి అని చూస్తుందన్నారు.

బీజేపీ నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

జిల్లాలో మతోన్మాద రాజకీయాలను అడ్డుకుంటాము అని అన్నారు.

అలాగే మంత్రి అజయ్ కుమార్ పై రేణుకా చౌదరి వ్యాఖ్యలను మరియు బిజెపి నాయకులు బండి సంజయ్, కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

వ్యక్తిగత చావుని అడ్డుపెట్టుకుని చేసే రాజకీయం ఎప్పటికీ నిలవదన్నారు.ఖమ్మం జిల్లా రాజకీయ జిల్లా మరియు చైతన్య వంతమైన జిల్లా మెరిసే ఎత్తుగడలకు లొంగదు అన్నారు.

అలాగే మిమ్మలను తరిమి తరిమి కొట్టిదన్నారు.దళితులపై, రైతులపై నిత్యం దాడులు చేస్తూ అనేక మంది చావులకు కారణమైందన్నారు.

బిజెపి విశ్వాసాలకు , సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంటే వారిపై దాడి చేపించడం.

కులాలను, మతాలను రెచ్చగొట్టడం వారికి కొత్తేమీ కాదని అన్నారు.

అవగాహన లేకుండా బూతు పురాణాల తో మత రాజకీయం చేస్తోందన్నారు.

చాలా దుర్మార్గంగా బిజెపి ప్రభుత్వం నడుచుకుంటుందని, ఒక ప్లానింగ్ ప్రకారమే సాయి గణేశ్ శవాన్ని అడ్డుపెట్టుకుని మత వవిద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయం చెయ్యటానికి కోసమే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని.

కావున ప్రజలందరూ గమనించాలని కోరారు.తెలంగాణ మొత్తం మీద బీజేపీ ప్రభుత్వానికి డిపాజిట్లు రావనే భయంతో వారి సౌలభ్యం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇలాంటి దుష్ట ప్రచారాలు చేస్తుందన్నారు.

అన్యాయం పుణ్యం తెలవని ఆ అమాయకుడి ప్రాణాలను గల్లా మరి గిల్లీ రెచ్చగొట్టి చనిపోవడానికి ఆజ్యం పొసారన్నారు.ఆ పాపం పుణ్యం వారికే తెలియాలన్నారు.

బీజేపీకి ప్రజాస్వామ్యం అంటే ఏమాత్రం గౌరవం లేదని, ఖబద్దార్ బీజేపీ నాయకులరా ఈ సమాజంలో ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ బ్రతికే ఉన్నాయని మీరు ఎన్ని వేషాలు వేసినా చివరికి న్యాయమే గెలుస్తుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిన రాష్ట్ర పార్టీలో మీద కక్ష కట్టి విషం కక్కుతూ వారికి రావాల్సిన నిధులను కూడా ఇవ్వట్లేదని ఆరోపించారు.

గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా బిజెపి నాయకులు వారే ఉసిగొలిపి మళ్ళీ వారే సానుభూతి ప్రకటిస్తారని అన్నారు.

నేరుగా రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ కుట్రలో భాగంగా అసత్య ప్రచారాలు చేస్తూ ఇలాంటి చర్యలకు దిగుతున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అధ్యక్షులు ఏం నాగేశ్వరావు , ఆర్టీసీ స్టాండింగ్ కన్వీనర్ బసవ పున్నయ్య, జిల్లా నాయకులు పసుపులేటి శ్రీనివాసరావు, ఏం ప్రకాశ్, మోహన్, గోవిందరావు, లింగయ్య, దానయ్య, రాంబాబు, రెంటాల ఆనంద్, మామిడి హన్మంతరావు, ఆవుల రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube