నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్( Niti Aayog Road Map ) లో విశాఖకు స్థానం దక్కిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు.అభివృద్ధి చెందిన నగరంగా విశాఖపట్నం స్థానాన్ని దక్కించుకుందని తెలిపారు.
విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు రాబోతున్నాయని పేర్కొన్నారు.విశాఖ గ్రోత్ హబ్ గా మారుతుందన్న ఎంపీ జీవీఎల్( BJP MP GVL Narasimha Rao ) ఈనెల 15వ తేదీన వైజాగ్ లో నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుందని తెలిపారు.
అలాగే దేశంలో మరోసారి మోదీ సర్కార్ రావాలని ప్రజల కోరుకుంటున్నారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే సుమారు 404 మూడో సారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.