కోహ్లీ స్ఫూర్తితో బెంగళూరు జట్టు ఖాతాలో తొలి విజయం.. స్మృతి మందాన ఆసక్తికర వ్యాఖ్యలు..!

డబ్ల్యూపీఎల్ లో వరుసగా ఐదు ఘోర ఓటములను ఖాతాలో వేసుకున్న బెంగళూరు జట్టు ఎట్టకేలకు తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.అయితే ఐపీఎల్ లో 15 సీజన్లుగా పురుషుల బెంగళూరు జట్టు టైటిల్ గడవడానికి అష్ట కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే.

 Virat Kohli Motivates Smriti Mandhana Led Royal Challengers Bangalore Team Detai-TeluguStop.com

ఇదే తరహాలో డబ్ల్యూపీఎల్ లో కూడా మహిళల బెంగుళూరు జట్టు అదే పరంపరతో ముందుకు కొనసాగుతోంది.జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నా కూడా ఒక మ్యాచ్ లో బ్యాటింగ్, మరో మ్యాచ్లో ఫీల్డింగ్ లో రాణించలేక బెంగళూరు జట్టు( Royal Challengers Bangalore ) సతమతమవుతూ ఓటములను ఖాతాలో వేసుకుంటూ ముందుకు సాగుతోంది.

యూపీ వారియర్స్ తో జరిగిన తొలి మ్యాచ్లో చిత్తుగా ఓడి, రెండవ మ్యాచ్లో అద్భుత ఆటను ప్రదర్శించి తొలి ఘన విజయాన్ని నమోదు చేసింది.

Telugu Cricketervirat, Mumbai Indians, Smriti Mandhana, Warriors, Virat Kohli, W

దీనిపై స్పందించిన కెప్టెన్ స్మృతి మందాన,( Smriti Mandhana ) ఈ గెలుపుకు కారణం విరాట్ కోహ్లీ( Virat Kohli ) స్ఫూర్తి కారణం అని తెలిపింది.వరుస పరాజయాలతో కృంగిపోయిన తమ జట్టుకు విరాట్ కోహ్లీ మాటలు స్ఫూర్తి నింపాయని తెలిపింది.తమ జట్టు సభ్యులతో విరాట్ కోహ్లీ చాలా సేపు మాట్లాడి.

మంచి మోటివేషన్ ఇవ్వడంతో తొలి విజయం సాధ్యమైందని చెప్పింది.తన కెరీర్లో ఇంత దరిద్రమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని, ఓడిన మ్యాచ్లలో తప్పిదాలను గ్రహించి, సరిదిద్దుకొని రాణించాలి అని విరాట్ కోహ్లీ చెప్పిన మాటలు తమ జట్టుకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయని స్మృతి మందాన తెలిపింది.

Telugu Cricketervirat, Mumbai Indians, Smriti Mandhana, Warriors, Virat Kohli, W

ఇక అసలు విషయానికి వస్తే బెంగుళూరు జట్టు ప్లే-ఆఫ్ కు చేరాలంటే తరువాత జరిగే గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లపై ఖచ్చితంగా విజయం సాధించాల్సిందే.కానీ ఇప్పటివరకు ఓటమి ఎరుగని ముంబై ఇండియన్స్ ను ఢీకొట్టడం అంటే కాస్త కష్టమే.అంతేకాకుండా మరొక అవకాశం ఏమిటంటే గుజరాత్ ను ఓడిస్తే బెంగళూరు మూడో స్థానానికి వెళుతుంది.యూపీ వారియర్స్ ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.అందులో కచ్చితంగా రెండు మ్యాచ్లు ఓడిపోతే బెంగుళూరు జట్టుకు ప్లే- ఆఫ్ అవకాశం దక్కుతుంది.లీగ్ టేబుల్ లో టాప్ త్రీ లో ఉండే టీమ్స్ ప్లే-ఆఫ్ కు వెళ్తాయి.

టాప్ వన్ లో ఉండే జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది.రెండు, మూడు స్థానాలలో ఉండే జట్లు క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడి, గెలిచిన జట్టు ఫైనల్ కు వెళుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube