ఏందయ్యా ఇది.. గుడ్డుతో హల్వా తయారీని ఎప్పుడైనా చూశారా.. వీడియో వైరల్..

ఆహార ప్రయోగాల ప్రపంచంలో ఒక వింతైన వంటకం ఇటీవల వైరల్ వీడియోగా మారింది.ఈ వంటకంలో ఏం వాడారో ఊహించగలరా? గుడ్లు! అవును, మనకు తెలిసిన ప్రోటీన్ గుడ్లను( Egg ) ఇప్పుడు ఒక డెజర్ట్‌లో మెయిన్ ఇంగ్రెడియంట్ గా వాడేసారు.ఆ డెజర్ట్‌ మారేదో కాదు.మనం ఎంతో ఇష్టంగా తినే హల్వా.( Halwa ) దీనిని ఎగ్ హల్వా అంతరాట.ఈ గుడ్డుతో హల్వా తయారీ అనేది చాలా కొత్త ఆలోచన.

 Viral Video Woman Cooking Egg Halwa Details, Food Experimentation, Viral Video,-TeluguStop.com

అందుకే దీని గురించి తెలుసుకుని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.నిజానికి దీనిని తయారీ విధానం చాలా సులభం.

డెజర్ట్( Dessert ) చూడటానికి చాలా అందంగా ఉండటంతో పాటు రుచికరంగా కూడా ఉంటుంది.

ఈ ఎగ్ ప్రిపరేషన్ వీడియో ఓపెన్ చేస్తే ఒక మహిళ గిన్నెలో గుడ్లు పగులగొట్టి, వాటితో పాటు పిండి, చక్కెర కలిపి ఒక వింతైన పిండిని తయారు చేస్తుంది.ఆ తరువాత ఎలక్ట్రిక్ బీటర్‌తో మిశ్రమాన్ని బాగా కలుపుతుంది.ఒక పాన్‌లో నెయ్యి వేడి చేసి, ఈ గుడ్డు-పిండి-చక్కెర మిశ్రమాన్ని పోస్తుంది.

ఉడికేటప్పుడు మిశ్రమం చిక్కబడుతుంది.చివరగా, క్రీమ్‌తో పాటు డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి, ‘గుడ్డు హల్వా’( Egg Halwa ) అనే అద్భుతమైన డెజర్ట్‌ను తయారు చేస్తుంది.

ఈ రెసిపీని ట్రై చేయాలనుకునే వారి కోసం పదార్థాలు కూడా తెలియజేసారు.అవి 6 గుడ్లు, 1 కప్పు చక్కెర, 1 కప్పు పాల పొడి, 1 కప్పు నెయ్యి లేదా వెన్న, 1 కప్పు క్రీమ్.గుడ్లు మనం రోజూ తినే ఆరోగ్యకరమైన ఆహారం కానీ గుడ్లతో హల్వా కూడా చేయవచ్చనే సంగతి చాలా మందికి తెలియదు.ఈ రెసిపీ వీడియోకు 16 లక్షల వ్యూస్ వచ్చాయి.

చాలా మంది ఈ వింతైన వంటకం చూసి ఆశ్చర్యపోయారు.ఇది కొందరికి వికారంగా అనిపించింది, మరికొందరు ఈ డెజర్ట్‌ను రుచి చూడాలని ఆసక్తి చూపించారు.

కొంతమంది తమ అమ్మలు కూడా గుడ్డు హల్వా చేస్తుంటారని, అది చాలా రుచిగా ఉంటుందని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube