వీడియో: ఈ చిన్న లండన్ అపార్ట్‌మెంట్‌కు ఇంత అద్దెనా.. నెటిజన్లు ఆగ్రహం..!

సాధారణంగా సిటీల్లో ఒక రూమ్ తీసుకోవాలంటే వేలల్లో వెచ్చించాల్సి వస్తుంది.మన భారతదేశంలో కూడా మెట్రో సిటీల్లో అద్దెలు కనీసం 15000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి.

 Video Is The Rent For This Small London Apartment So Much Netizens Are Outraged-TeluguStop.com

అంత రెంట్ భరించాలంటే ఎంత జీతం రావాలో ఊహించుకోండి.ఇక అమెరికా ఇంగ్లాండ్ వంటి డెవలప్డ్ కంట్రీస్ లో చాలా చిన్నచిన్న గదులతో ఉన్న అపార్ట్‌మెంట్లు లక్షల రెంట్లతో షాక్ ఇస్తున్నాయి.

తాజాగా లండన్‌లోని ( London )సెంట్రల్ ప్రాంతంలో ఉన్న చాలా చిన్న అపార్ట్‌మెంట్ ( small apartment ) వీడియో టూర్ ఆన్‌లైన్‌లో చాలా చర్చనీయాంశమైంది.ఈ చిన్న ఇంట్లో కేవలం ఒక వంటగది, స్నానపు గది, కొన్ని అలమారాలు, ఒక బాల్కనీ మాత్రమే ఉన్నప్పటికీ, దాని అద్దె చాలా ఎక్కువగా ఉంది.దాని రెంట్ కాస్ట్ చాలా మంది నెటిజన్లకు ఆగ్రహం కలిగించింది.

ఈ అపార్ట్‌మెంట్ లండన్ నగరం మధ్యలో ఉన్న “సెంట్రల్ లండన్” ( Central London )ప్రాంతంలో ఉంది.ఇది చాలా రిచెస్ట్ ప్లేస్ అని అంటారు.అందుకే రేట్లు అలా ఉన్నాయి.ఈ చిన్న స్థలం నెలవారీ అద్దె 1,850 పౌండ్లు (సుమారు 1.9 లక్షల రూపాయలు) అని వీడియో తీసిన మహిళ వెల్లడించింది.లోపల ఒక చిన్న గది ఉంది, దానిలో ఒక బెడ్, గోడకు అమర్చిన టీవీ ఉన్నాయి.ఒక చిన్న అలమారా కొంచెం నిల్వ స్థలాన్ని అందిస్తుంది.బాత్రూమ్‌ కూడా చాలా చిన్నదిగా ఉంది.దీని లోపలికి వెళ్తే ఊపిరాడని ఇరుకైన ప్రదేశంగా అనిపిస్తుందని అనడంలో సందేహం లేదు.

ప్రదేశాన్ని బట్టి అద్దె ఈ స్థాయిలోనే ఉంటుందని కొంతమంది సమర్థించారు.దాదాపు రెండు లక్షల జీతం అద్దెకి వెళ్ళిపోతుంటే, ఆ ఇంటికి మెయింటైన్ చేయడానికి, నెలవారి ఖర్చులను భరించడానికి ఇంకా ఎంత సంపాదించాలో అని మరి కొందరు సందేహాలను వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube