వైరల్ వీడియో: కాస్తా కష్టమైన పామును బలే పట్టేసాడుగా..

నిజానికి మనలో చాలామంది పాములను( snakes ) చూస్తే అమాంతం పరిగెత్తవాళ్లు ఎందరో.ఇక అదే పామును పట్టుకోవడం అంటే అతి సామాన్య విషయం కాదని మనకు తెలిసిందే.

 Viral Video Of Kasta Killing A Difficult Snake, Snake, Viral Video, Viral Latest-TeluguStop.com

చాలామంది పాములు పట్టేవారు వాటిని పట్టుకొని సురక్షిత ప్రాంతాలలో తీసుకువెళ్లి వదిలేస్తారు.ఇకపోతే తాజాగా ఇలాంటి ఓ పాము పట్టుకునే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఓ వ్యక్తి తాను పాము పట్టుకోవడంలో ఎంత సిదహస్తుడో ఈ వీడియోను చూస్తే సరిపోతుంది.ఇక ఈ వైరల్ వీడియో సంబంధించి వివరాలు చూస్తే.

ఓ ఇంటి నుండి ఓ పొడవైన పాము బయటికి వచ్చింది.పామును పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ ( Snake Catcher )కి సమాచారం ఇవ్వగా అతను వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని చాలా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరిస్తూ ఆ పాముని చిన్న ప్లాస్టిక్ డబ్బాలోకి మట్టు పెట్టాడు.ఇక ఆ పాము పట్టే సమయంలో సమీపంలోని ప్రజలు ఆయన చేస్తున్న పనిని జాగ్రత్తగా చూస్తూ ఉండగా మరికొందరికితే వీడియోని తీసి అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దాంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

ఇక పాము పట్టే వ్యక్తి చేసిన పని సమయంలో చాకచక్యంగా వ్యవహరిస్తూ పాము నోటిని ముందుగా పెట్టే లోపల పెట్టినట్లుగా కనపడుతుంది.ఆ తర్వాత ఆ పాము శరీరం మొత్తాన్ని పెట్టెలో బంధించడానికి ప్రయత్నం చేశాడు.ఈ పాము పట్టే సమయంలో పాముకు ఎలాంటి గాయం కూడా జరగకపోవడం కాస్త సంతోషకరమైన విషయమే.చుట్టుపక్క ఉన్న ప్రజలు ఈ వీడియోని వారి సెల్ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం స్నేక్ క్యాచర్ వాడిన పద్ధతి ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తుంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను ఓసారి వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube