వైరల్ : పోలీసులకే ఛాలెంజ్ చేసిన దొంగ ..!

ఇటీవల కాలంలో దొంగతనాలు బాగా జరుగుతున్నాయి.దొంగలు కూడా రకరకాల పద్దతులతో దొంగతనాలకి ప్రయత్నిస్తున్నారు.

 Viral: A Thief Who Challenges The Police Rubber Mask, Theif, Atm , Police, Chall-TeluguStop.com

ఎక్కడిక్కడ సీసీ టీవీలు అమర్చిన గాని దొంగలు సీసీ టీవీ ఫుటేజ్ లో కూడా అంతుచిక్కని విధంగా దొంగతనాలు మొదలు పెట్టేసారు.తాజాగా ఇలాంటి ఒక విచిత్రమైన ఘటన ఒకటి ఎటిఎం సెంటర్ లో జరిగింది.

ముఖం కనిపించకుండా జోకర్ బొమ్మను ధరించి ఎటిఎం చోరీకి పాల్పడ్డాడు ఈ దొంగ.అయితే ప్లాన్ అయితే పగడ్భందిగా గానే వేసాడు కానీ దొంగతనం మాత్రం చేయలేకపోయాడు.

అసలు ఈ చోరీ ఎక్కడ జరిగింది ఏంటి అనే వివరాలు ఒకసారి చూద్దామా.ఈ దొంగతనం జరిగింది తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో ఈ చోరీ ఘటన జరిగింది.

అయితే ఇలాంటి దొంగతనం కన్యాకుమారి జిల్లాలోని రెండు ఏటీఎంలలో జరగడం గమనించాలిసిన విషయం.ఈ గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.ఈ దొంగతనంకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.హాలీవుడ్ తరహాలో ఎటిఎం చోరీకి ప్రయత్నించాడు ఈ దొంగ.

కురుంపనాయి ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలోని డబ్బు కొట్టేయడానికి ప్రయత్నం చేసాడు.ఎటిఎం మెషీన్ దగ్గర సీసీ కెమెరా ఉంటుందని తెలుసుకున్న ఆ దొంగ ముఖం కనిపించకుండా ఒక జోకర్ బోమ్మని ముఖానికి తగిలించుకొని జోకర్ డ్రెస్ తో ఎటిఎం లోకి వచ్చాడు.

ఎవ్వరు లేరని గ్రహించి ఎటిఎం గదిలోకి వచ్చాడు.వేలిముద్రలు కూడా దొరకకూడదు అనే ముందు జాగ్రత్తతో చేతులకు గ్లౌజులు ధరించి, చేతిలో ఒక రాడ్‌ను పట్టుకుని వచ్చాడు.

లోపలికి వచ్చాక ఆ రాడ్ తీసుకొని ఏటీఎంలో మెషీన్ ను కొట్టసాగాడు.,/br>

Telugu Rubber, Theif, Latest-Latest News - Telugu

కొద్ది సేపు ప్రయత్నం చేసిన తర్వాత ఎవరన్నా బయటినుంచి వస్తారెమో అని మళ్ళీ డోర్ వైపు చూస్తూ ఇంకోసారి రాడ్ తో కొట్టసాగాడు.పాపం మన దొంగ డబ్బులు కోసం శత విధాలా ప్రయత్నం చేసాడు కానీ లాభం లేదు ఒక్క పది రూపాయలు కూడా దొరకలేదు.కాగా ఏటీఏం మిషన్ ను దొంగ పగలకొట్టే ప్రయత్నం చేయగా అలారం మోగింది అది గమనించిన ఆ బ్యాంకు మేనేజర్, సిబ్బంది అక్కడికి హుటాహుటిన వెళ్లి చూసారు.

అయితే అప్పటికే దొంగ అక్కడనుంచి మాయం అయ్యాడు.డబ్బులు అయితే పోలేదు కానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఈ తతంగం అంతా బయట పడింది.మళ్ళా ఆ జోకర్ వేషంలో ఉన్న అదే వ్యక్తి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక ఏటీఏంలో కూడా దొంగతనానికి పాల్పడినట్లు కరుంగల్ పోలీసులు చెప్పారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

జోకర్ వేషం అయితే వేసాడు గాని నిజంగానే జోకర్ అయిపోయాడు అని కామెంట్స్ పెడుతున్నారు.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube