మలయాళ స్టార్ హీరోల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) ఒకరు.ఇతడు ఒకప్పుడు మలయాళ పరిశ్రమకు మాత్రమే పరిమితం కానీ ఇప్పుడు అలా కాదు.
ఇతడు పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు.సీతారామం సినిమాలో రామ్ గా వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ యంగ్ హీరో సినిమాలంటే అన్ని బాషల ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు.
సీతారామం( Sita Ramam ) వంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్ ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాను ప్రకటించాడు.టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ నెక్స్ట్ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఈ రోజు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ ప్రీ లుక్ పోస్టర్ లో దుల్కర్ సల్మాన్ ముఖాన్ని కవర్ చేస్తూ పాత 100 రూపాయల నోట్లు కనిపిస్తున్నాయి.
ఈ రోజు దుల్కర్ సల్మాన్ బర్త్ డే కానుకగా ఈ సినిమా నుండి ప్రీ లుక్ అండ్ టైటిల్ ను రిలీజ్ చేసారు.‘‘లక్కీ భాస్కర్( Lucky Bhaskar )” అనే టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేసారు.దీంతో ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.పోస్టర్ ను బట్టి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.ఇక సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు నిర్మిస్తుండగా జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.మరి దుల్కర్ సల్మాన్ ఈ సినిమాతో సీతారామం వంటి బ్లాక్ బస్టర్ ను అందుకుంటాడా లేదా చూడాలి.
ఇంతకు ముందు టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేసి బ్లాక్ బస్టర్ అందుకోగా ఇప్పుడు వెంకీ అట్లూరితో ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.