బాలీవుడ్‌లో రికార్డులు బద్దలు కొడుతూ కలెక్షన్స్‌ను వసూళ్లు చేస్తూ దూసుకు వెళ్తున్న ‘భజరంగీ భాయిజాన్’ చిత్రంను తెలుగులో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా గత కొన్ని రోజుల ముందు మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమా రీమేక్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తాడు అంటూ మొదట వార్తలు వచ్చాయి.
హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు మరియు రాక్ లైన్స్ వెంకటేష్‌ు నిర్మించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.అయితే వార్తలను దిల్‌రాజు కొట్టి పారేశాడు.
దాంతో రీమేక్ లేనట్లే అని అంతా అనుకున్నారు.
తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో ఈ రీమేక్ గురించి మరోసారి పుకార్లు పుట్టుకు వస్తున్నాయి.
రీమేక్‌ల కింగ్ అయిన వెంకటేష్ ఈ సినిమాపై ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.మున్నీ కోసం పాకిస్తాన్‌కు వెళ్లేందుకు వెంకటేష్ సుముఖతను వ్యక్తం చేశాడని అంటున్నారు.
ఎన్నో రీమేక్‌లలో నటించి సక్సెస్‌లను సాధించిన వెంకటేష్‌కు భజరంగీ భాయిజాన్ పాత్ర బాగా సూట్ అవుతుందని కొందరు అంటున్నారు.పవన్ కళ్యాణ్‌తో రీమేక్ అన్నారు, అవి పుకార్లే అని తేలిపోయాయి.
తాజాగా వెంకీతో రీమేక్ అంటున్నారు, మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో…!