మహేష్‌బాబులో ‘శ్రీమంతుడు’ సినిమాతో చాలా మార్పు వచ్చినట్లుగా అనిపిస్తున్నట్లు చాలా మంది అంటూ ఉన్నారు.మహేష్‌లో ఈ మార్పుకు ఫ్యాన్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
తాజాగా తనలో మార్పు వచ్చిందని స్వయంగా మహేష్‌బాబు ఒప్పుకున్నాడు.తాను గతంలో మీడియా ముందుకు వచ్చేందుకు సిగ్గు పడేవాడిని అని, దాంతో సినిమా ప్రచార కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు.
తాజాగా ‘శ్రీమంతుడు’ సక్సెస్ మీట్‌లో భాగంగా మహేష్‌బాబు మీడియాతో ముచ్చటించాడు.
‘శ్రీమంతుడు’ విడుదలకు ముందు నుండి ఇప్పటి వరకు మహేష్‌బాబు మీడియా ముందుకు దాదాపు అరడజను సార్లు వచ్చాడు.
గతంలో ఏ సినిమాకు సైతం ఈ స్థాయి ప్రమోషన్‌లో మహేష్ పాల్గొనలేదు.ఏ సినిమాకు అయినా ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ప్రచారం కోసం మీడియా ముందుకు వచ్చాడు.
కాని తనలో మార్పు రావడం వల్లే ఈసారి ఎక్కువ సార్లు మీడియా ముందుకు వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు.సినిమాకు పబ్లిసిటీ చాలా అవసరం అనే విషయం తెలియడం వల్లే తాను ఇలా ప్రచారంలో పాల్గొంటున్నట్లుగా మహేష్ అన్నాడు.
నిర్మాతగా మారిన తర్వాతే మహేష్‌బాబుకు పబ్లిసిటీ విలువ తెలిసి వచ్చిందా అంటూ కొందరు నిర్మాతలు గుసగుసలాడుకుంటున్నారు.