హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలకృష్ణ ప్రస్తుతం వరస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు అన్ స్టాపబుల్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.ఈ వయసులో కూడా అదే ఊపుతో నటిస్తూ వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.
ఇకపోతే బాలయ్య బాబు ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది.
ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త తెగ వైరల్ అవుతోంది.
అదేమిటంటే గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్ లో వీర సింహారెడ్డి సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.అలాగే ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒక పాత్రలో నటించనుందట.వీరసింహా రెడ్డిలో వరలక్ష్మీ ఒక ముఖ్యమైన పాత్రలో నటించనుందట.
ఆ పాత్ర ఈ సినిమాలో కీలకమై తెలుస్తోంది.

అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలో ఒక ట్విస్ట్ కూడా ఉంటుందని,ఆ ట్విస్ట్ వర్క్ అవుట్ అయితేనే మిగతా కథలో ఎమోషన్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని తెలుస్తోంది.ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పటికే పలు సినిమాలలో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లలో నటించిన విషయం తెలిసిందే.వాటితో పోల్చుకుంటే వీర సింహారెడ్డి సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.కాగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి పండగ కానుకగా విడుదల కానుంది.