సాధారణంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.సెలబ్రిల చిన్నప్పటి ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.
సోషల్ మీడియాలో ఒక హీరో లేదా హీరోయిన్ కి సంబంధించిన ఫోటో ని షేర్ చేసి ఇందులో ఉన్న హీరో లేదా హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ రాసుకుంటూ ఉంటారు.అలా తరచూ ఏదోక సెలబ్రిటీ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి.
తాజాగా కూడా సోషల్ మీడియాలో ఒక చిన్నారికి సంబంధించిన ఫోటో తెగ వైరల్ అవుతోంది.
అప్పుడు కనిపిస్తున్న చిన్నారి ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.
ఆ హీరోయిన్ మరెవరో కాదు.టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా.
ఈ ముద్దుగుమ్మ తెలుగు తమిళం హిందీ భాషల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్ళు పూర్తి అవుతున్నా ఇప్పటికీ అదే అందంతో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది తమన్నా.
మంచు మనోజ్ నటించిన శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది తమన్నా.
ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆతర్వాత వరుసగా టాలీవుడ్ లో ఆఫర్లు అందుకుంది.ఇలా తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఇప్పించిన విషయం తెలిసిందే.
కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా మరొకవైపు యాడ్స్ లో నటిస్తూ వెబ్ సిరీస్లలో నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం తమన్న చిన్నప్పటికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతోంది.