ట్రంప్ కి ఊరట...హెచ్ 1బీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!!!

అమెరికాలో ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అమెరికన్స్ కి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలని నెరవేర్చడానికి ట్రంప్ వలస వీసాల విషయంలో ఆంక్షలు విధించిన విషయం విధితమే.ఎన్నికల వేళ ట్రంప్ వలస వాసులకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోక తప్పలేదు.

 Us Judge Denies Preliminary Injunction On H-1b Visa Ban, H-1b Visa Ban,us, Dona-TeluguStop.com

అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల సుమారు 169 మంది ఎన్నారైలు పలు కంపెనీలు స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు.అంతేకాదు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వలన అమెరికా ఆర్ధిక ,వ్యపార , వాణిజ్య వ్యవస్థకి తీవ్ర ఆటంకం కలుగుతుందని కంపెనీలు కోర్టుకు విన్నవించాయి.

అయితే


కోవిడ్ నేపద్యంలో స్థానికులకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయి.కంపీనీలు సైతం ఇతర దేశాల నుంచీ వచ్చిన వారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి.

దాంతో హెచ్ -1 బీ వీసాపై నిషేధాన్ని వేయక తప్పలేదు అంటూ ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేసింది.ఈ నిషేధం కూడా శాశ్వతం కాదని ఈ ఏడాది చివరి వరకూ ఉంటుందని ప్రకటించింది.

నిపుణులైన వలస వాసులని మాత్రమే అనుమతించేలా ప్రణాళికలు ప్రభుత్వం రూపొందించిందని కూడా తెలిపింది.ఇదిలాఉంటే

ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో వేసిన పిటిషన్ పరిశీలించాలని తాము మళ్ళీ అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే విధంగా తీర్పు ఇవ్వాలని , తమ వీసాలను పునరుద్దరించాలని పిటిషన్ లో భారతీయులు కోరారు.

అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన వాషింగ్టన్ కోర్టు జిల్లా జడ్జి అమిత్ మొహతా ట్రంప్ కి అనుకూలంగా తీర్పుని ఇచ్చారు.వీసాలపై ఆంక్షలు విధించకుండానే అడ్మినిస్ట్రేషన్ ని నియంత్రించలేమని తెలిపారు.

అయితే ఈ తీర్పుపై పిటిషన్ తరపు న్యాయవాది స్పందించారు.త్వరలో పై కోర్టుకు అప్పీల్ చేయనున్నట్టుగా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube