భాను చందర్ కేవలం హీరోనే కాదు.. అతడి గొప్పతనం గురించి తెలుసుకోవాల్సిందే !

కేజిఎఫ్ సినిమా మీరందరూ చూసే ఉంటారు రాఖీ బాయ్ ని చూడగానే కేజిఎఫ్ సినిమాలో ఒక బుడ్డోడి కళ్ళు ఆశ్చర్యంగా అతనినే చూస్తూ చూస్తూ ఉంటాడు ఒక యోధుడు వచ్చినట్టుగా కనిపిస్తాడు.అలాంటి ఒక ఆశ్చర్యమే మన బాపు గారికి కూడా కలిగిందట అంతేకాదు, బాలు మహేంద్ర గారికి కూడా కలిగిందట.ఆ సంగతి ఏంటో, ఆ ఆశ్చర్యం ఎవరి కోసమో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి.1978లో మన ఊరి పాండవులు అనే సినిమా విడుదలై హిట్టైన సంగతి మన అందరికీ తెలుసు.ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం అది.మహాభారతాన్ని మోడ్రనైజ్ చేసి ఈ సినిమా తీశారు అన్న విషయం కూడా మనకు తెలిసిందే.ఈ సినిమాలో కృష్ణుడిగా కృష్ణంరాజు కనిపిస్తే పాండవులుగా మురళీమోహన్, ప్రసాద్, చిరంజీవి, భానుచందర్, విజయభాస్కర్ లు నటించారు.ఈ సినిమా లీడ్ లో కృష్ణంరాజు మురళీమోహనే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటారు.

 Unknown Facts About Hero Bhanu Chandar ,muralimohan, Prasad, Chiranjeevi, To-TeluguStop.com

ఇక పాండవుల్లో చిరంజీవి, భానుచందర్ లాంటి వాళ్లు సెకండ్ లీడ్ పొజిషన్లోనే ఉన్నారు కానీ వారు ఫ్రేమ్ లోకి రాగానే బాబు గారి దృష్టి ఈ పాండవుల్లో ఓ ఇద్దరి పైన పడింది.వారెప్పుడూ ఫ్రేమ్ లోకి వచ్చినా కూడా బాపుగారు కళ్ళు ఆశ్చర్యంతో అచ్చం కేజీఎఫ్ లో పిల్లాడిలా వాళ్లనే చూస్తూ ఉండేవాడు.

అంతే కాదు ఈ సినిమా అవుతున్నంతసేపు వారిద్దరి బొమ్మలు కూడా గీస్తూనే ఉన్నారట బాపుగారు.పక్కనే ఉన్నారు రమణ గారితో కూడా చెప్పారట వీరిద్దరు గొప్ప స్టార్స్ అవుతారండి వాళ్ళ కళ్ళల్లో ఒక స్పార్క్ ఉంది అని.ఆ ఇద్దరూ మరెవరో కాదు చిరంజీవి, భానుచందర్.

Telugu Bhanu Chandar, Bhanuchander, Chiranjeevi, Muralimohan, Prasad, Tollyaood,

చిరంజీవి మెగాస్టార్ గా టాలీవుడ్ లో ఎంత పెద్ద హీరో అయ్యాడో మనం చూస్తూనే ఉన్నాం.భానుచందర్ కూడా అంత లెవెల్లో కాక పోయినా తన స్థాయిలో తాను బాగానే సెటిల్ అయ్యాడు.మన ఊరి పాండవులు సినిమాకి సినిమాటోగ్రఫీ బాలు మహేంద్ర ఇచ్చారు.

ఆయన కళ్ళే కెమెరా కళ్ళు కాబట్టి ఆయన కూడా చిరంజీవి, భానుచందర్ లలో ఉన్న స్పార్క్ ని గుర్తుపట్టేశారు.అందుకే ఆ తర్వాత కాలంలో భానుచందర్ తో నిరీక్షణ అనే ఒక అద్భుతమైన సినిమా తీసి చరిత్ర పుటల్లో నిలిచారు.

నిజానికి భానుచందర్ ని కేవలం నటుడుగానే అందరూ అనుకుంటారు కానీ అతడు నటుడు మాత్రమే కాదు సినిమా ప్రొడ్యూసర్, దర్శకుడు, స్క్రీన్ రైటర్ అలాగే మ్యూజిక్ కంపోజర్ కూడా. భానుచందర్ తండ్రి కూడా వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్.

తెలుగు సినిమాల్లో మొదటిసారిగా మార్షల్ ఆర్ట్స్ ని పరిచయం చేసిన గొప్పతనం కూడా భానుచందర్ కే దక్కుతుంది అతడు రెండు సినిమాలకు కూడా దర్శకత్వం వహించిన విషయం చాలా మందికి తెలియదు.సింధూరం సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా భానుచందర్ అద్భుతంగా చేశారు.

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై అంటూ ఆయన గాఢమైన ఎక్స్ప్రెషన్స్ చూస్తే కన్నీళ్లు పెట్టని ప్రేక్షకులే లేరు.భానుచందర్ అసలు పేరు మద్దూరి వెంకట సత్య సుబ్రహ్మణ్యేశ్వర భానుచందర్ ప్రసాద్.

తన కొడుకుని కూడా హీరో చేయాలని పరితపించిన ఒకటి రెండు సినిమాలతో అతడి కెరియర్ ముగిసిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube