ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి( YCP ) ఘోరంగా ఓటమి చెందిన సంగతి తెలిసిందే .కేవలం 11 అసెంబ్లీ , నాలుగు పార్లమెంటు స్థానాలకు మాత్రమే పరిమితం కావడం తో, ఆ పార్టీ శ్రేణులు పూర్తిగా డిలా పడ్డాయి.
వై నాట్ 175 అనే నినాదాన్ని వినిపించినా, ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసినా, వైసీపీ ఘోరంగా ఓటమి చెందింది.టిడిపి , జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చింది.
ఓటమి కి గల కారణాలను పార్టీ శ్రేణులతో వైసీపీ అధినేత జగన్( YS Jagan ) సమీక్ష నిర్వహిస్తున్నారు.

తాజాగా సీనియర్ పొలిటిషన్, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్( Undavalli Arun Kumar ) వైసిపి ఓటమి కి గల కారణాలను విశ్లేషించారు.వైసిపి ఈ స్థాయిలో ఘోరంగా ఓటమి చెందడానికి కారణం అన్ బ్రాండెడ్ మద్యం ఎఫెక్ట్ అని, అదే వైసిపి ప్రభుత్వం కుప్పకూలేల చేసిందని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.ఆ భారం బడుగు బలహీన వర్గాలపై పడిందని, ఊరు పేరులేని లిక్కర్ బ్రాండ్లను( Liquor Brands ) మార్కెట్లోకి తీసుకురావడం జగన్ చేసిన పెద్ద తప్పు అని ఉండవల్లి పేర్కొన్నారు.

ఏపీలో టిడిపి పొత్తే డెడ్లీ కాంబినేషన్ అని, కూటమిలో బిజెపి లేకపోయి ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు.టిడిపి, జనసేన కు వచ్చిన స్థానాల దృష్ట్యా, ఢిల్లీలో చక్రం తిప్పేందుకు చంద్రబాబుకు( Chandrababu ) ఇదే సరైన సమయం అని , దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఏపీ ప్రయోజనాల కోసం కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు కృషి చేయాలని ఉండవల్లి అన్నారు .ఏపీకి రావలసిన నిధులు తీసుకురావాలని, విశాఖ రైల్వే జోన్ , విశాఖ ఉక్కు , పోలవరం వంటి క్రిష్టమైన వాటి పైన కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు.