భారత్‌లో చిక్కుకుపోయి.. ఇక యూకే తిరిగి వెళ్లలేనని: ఎన్ఆర్ఐ ఆత్మహత్య

కరోనా వైరస్ కారణంగా అన్ని దేశాలు లాక్‌డౌన్‌‌ను పాటిస్తున్నాయి.రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో అటు నుంచి ఇటు.ఇటు నుంచి అటు వెళ్లే వీలు లేకపోవడంతో ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు.అయిన వారు ఓ చోట.తాను మరో చోట ఉండటంతో కొందరు ఒంటరితనంతో కృంగిపోతున్నారు.ఇలాగే నిరాశ నిస్పృహలతో నరకయాతన అనుభవించిన ఓ ఎన్ఆర్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 Corona Virus, Lock Down, Britain, Prime Minister, Narendra Modi, Amarjeet Singh,-TeluguStop.com

పంజాబ్‌కు చెందిన 72 ఏళ్ల అమర్‌జీత్ సింగ్, అతని భార్య బల్బీర్ కౌర్ బ్రిటీష్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు.ఈ దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి యూకే‌లో నివసిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 29న వీరు పంజాబ్‌లోని జలంధర్‌కు వచ్చారు.దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలవ్వడంతో ప్రధాని నరేంద్రమోడీ లాక్‌డౌన్ ప్రకటించారు.

వారు మార్చిలో తిరిగి బ్రిటన్‌కు వెళ్లాల్సి వుంది.కానీ లాక్‌డౌన్ మే 3 వరకు పొడిగించడంతో అమర్‌జీత్ సింగ్ తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు.

Telugu Amarjeet Singh, Balbir Kaur, Britain, Corona, Lock, Narendra Modi, Prime-

దీనికి తోడు బ్రిటన్ పౌరుల కోసం ఆ దేశ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల్లోనూ సీట్లు దొరక్కపోవడంతో ఆయన మరింతగా నిరాశకు లోనయ్యారు.ఈ నేపథ్యంలో రామా మండిలోని తన ఇంటి ఆవరణలో ఉన్న జనరేటర్ రూపంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.మంగళవారం ఉదయం నిద్రలేచిన బల్బీర్ సింగ్‌కు తన భర్త కనిపించకపోవడంతో ఇంటి పక్కనే వున్న అమర్‌జీత్ సింగ్ సోదరుడిని పిలిచారు.వీరంతా కలిసి వెతక్క జనరేటర్ రూంలో ఉరికి వేలాడుతూ కనిపించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.మృతుడు ఎలాంటి సూసైడ్ నోట్‌ను రాయలేదు.

యూకే తిరిగి వెళ్లలేకపోవడంతో ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.అనంతరం అమర్‌జీత్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube