U S Army : అమెరికా సైనిక ఉద్యోగాల్లో కోత.. పెద్దన్న నిర్ణయం వెనుక ..?

అమెరికా సైన్యం తన బలగాల పరిమాణాన్ని దాదాపు 24 వేలు లేదా 5 శాతం తగ్గించుకుంది.ఎప్పుడైనా యుద్ధం తలెత్తితే మెరుగైన పోరాటాన్ని చేయగలిగేలా పునర్నిర్మాణం చేస్తోంది.

 U S Army Slashes Thousands Of Jobs To Prepare For Future Wars-TeluguStop.com

రిక్రూట్‌మెంట్ లోపాలతోనే అమెరికా సైన్యం పోరాడుతోందని పలు నివేదికలను చెబుతున్నాయి.అది పూరించడానికి తగినంత మంది సైనికులను తీసుకురావడం అసాధ్యం .తాజా కోతలు ప్రధానంగా ఇప్పటికే ఖాళీగా వున్న పోస్టులలో వుంటాయి.ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల సమయంలో వున్న స్థాయిలో రిక్రూట్‌మెంట్‌‌లు ఇప్పుడు లేవు.

దాదాపు 3 వేల కోతలు ఆర్మీ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్స్( Army Special Operations Force ) నుంచి చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదే సమయంలో ఈ ప్రణాళికలో వైమానిక రక్షణ, కౌంటర్ డ్రోన్ యూనిట్లు, మెరుగైన సైబర్, ఇంటెలిజెన్స్ , లాంగ్ రేంజ్ స్ట్రైక్ సామర్ధ్యాలతో ప్రపంచవ్యాప్తంగా ఐదు కొత్త టాస్క్‌ఫోర్స్‌లతో సహా ఇతర క్లిష్టమైన మిషన్‌లలో దాదాపు 7500 మంది సైనికులను చేర్చుకుంటారు.

Telugu Afghanistan, Force, China, Wars, Intelligence, Iraq, Joe Biden, Russia-Te

ఆర్మీ డాక్యుమెంట్ ప్రకారం .వేలకొద్దీ ఖాళీ పోస్టులను భర్తీ చేయలేకపోయిందనే వాస్తవాన్ని ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుంది.వచ్చే ఐదేళ్లలో 4,70,000 స్థాయికి దళాలు చేరుకునేలా చేయడం కొత్త ప్రణాళిక లక్ష్యం. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లలో రెండు దశాబ్ధాల యుద్ధం తర్వాత ప్రణాళికాబద్ధమైన సమగ్ర మార్పు వచ్చింది.

ఇది యుద్ధానికి పంపిన బ్రిగేడ్‌లను పూరించడానికి సైన్యాన్ని విస్తరించేలా ఒత్తిడి చేసింది.ఇందులో ఆల్‌ఖైదా , తాలిబాన్, ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో పోరాడేలా రెస్పాన్స్ టీమ్ కూడా వుంది.

Telugu Afghanistan, Force, China, Wars, Intelligence, Iraq, Joe Biden, Russia-Te

కాలక్రమేణా అమెరికా సైన్యం దృష్టి చైనా, రష్యా ( China, Russia )వంటి శత్రువులకు పోటీ ఇవ్వడంతో పాటు ఇరాన్, ఉత్తర కొరియా చేస్తున్న బెదిరింపుల వైపు మళ్లింది.ఉక్రెయిన్‌ యుద్ధం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వైమానిక, సముద్ర ఆధారిత డ్రోన్‌లను ఉపయోగించడానికి , ఎదుర్కోవడానికి హై టెక్ సామర్ధ్యాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని చూపించింది.అదనపు బలగాలను ఎక్కడ వినియోగించాలో, హైటెక్ ఆయుధాలతో సైన్యాన్ని ఆధునీకరించడానికి జరుగుతున్న ప్రయత్నాలను యూఎస్ ఆర్మీ( U S Army )ఉన్నతాధికారులు పరిశీలించారు.ప్రణాళిక ప్రకారం.

సైన్యం ఇంజనీర్ల కోసం దాదాపు 10 వేల ఖాళీలను , తిరుగుబాటు నిరోధక మిషన్‌లతో ముడిపడివున్న ఉద్యోగాలను తొలగించనుంది.అశ్విక దళ స్క్వాడ్రన్‌లు, స్ట్రైకర్ బ్రిగేడ్ పోరాట బృందాలు , పదాతి దళ బ్రిగేడ్ పోరాట బృందాలు, భద్రతా దళ సహాయ బ్రిగేడ్‌ల నుంచి దాదాపు 10 వేల పోస్టుల్లోనూ కోత విధించే అవకాశం వుంది.

వీటిని విదేశీ దళాలకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగిస్తారు.ఈ మార్పులు సైన్యం మరింత అధునాతనంగా మారిన శత్రువులపై పెద్ద ఎత్తున పోరాట కార్యకలాపాలకు సిద్ధం కావడానికి గణనీయమైన మార్పును సూచిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube