హ్యాంకాంగ్ కు చెందిన వర్చువల్ కరెన్సీ ఎక్స్ ఛేంజి ‘బిట్ ఫినెెక్స్’ హ్యాకింగ్ వ్యవహారం ఐదేళ్ల తర్వాత పరిష్కారమైంది.ఈ కేసులో 3.6 బిలియర్ డాలర్లు (సూమారు 27వేల కోట్లు) స్వాధీనం చేసుకున్నారు.ఈ క్రమంలో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులు నిందితులైన లిక్టెన్ స్టెయిన్, హీథర్ మోర్గాన్ దంపతులను అరెస్టు చేశారు.
వీరు వ్యాపార వేత్తలుగా చెలామణి అవుతూ.దొంగలించిన బిట్ కాయిన్లను లాండిరంగ్ చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు అభియోగాలున్నాయి.
2016 హ్యాకాంగ్ కు చెందిన బిట్ ఫినెక్స్ అనే బిట్ కాయిన్ ఎక్స్ ఛేంజిలో 1,19,754 బిట్ కాయిన్లను హ్యాకర్లు దొంగలించారు.వారు ఇందుకోసం దాదాపు 2000 లావాదేవీలు జరిపారు.
అప్పట్లో బిట్ కాయిన్ల విలువ 71 మిలియన్ డాలర్లు.కాగా ప్రస్తుతం ఈ బిట్ కాయిన్ల విలువ 4.5 బిలియన్ డాలర్లగా లెక్కగట్టారు.ఇలియా లిక్టెన్ స్టెయిన్ అధీనంలోని ఓ డిజిటల్ వాలెట్ కు చేరాయి.వీటి విలువ 3.6 బిలియన్ డాలర్లుగా చెబుతున్నారు.వీటిని కొన్నాళ్లు అల్భాబే అనే డిపాజిట్ ప్లాట్ ఫాంలో ఉంచారు.అయినా వారు చిన్న మొత్తంలోనే ఖర్చు చేసేవారు.మనీ లాండరింగ్ కోసం వాడే ప్రత్యేకమైన కంప్యూటర్ ప్రోగ్రాం సాయంతో వేర్వేరు పర్చువల్ ఖాతాల్లో డార్క్ నెట్ లోకి బదలాయించేవారు.
ఆ తర్వాత విత్ డ్రా చేసేవారు.పెట్టుబడిదారులుగా చెప్పుకొంటూ ఇలియా లిక్టెన్ స్టెయిన్, హీథర్ మోర్గాన్ ప్రోఫైల్ చూస్తే ఎవరైనా ఇంప్రెస్ అవ్వాల్సిందే అన్నట్లుగా ఉంటుంది.తనను ఆమె వాల్ స్ట్రీట్ మొసలిగా అభివర్ణించుకొంది.
ఇలియా లిక్టెన్ స్టెయిన్ అమెరికా పౌరుడు లింక్డ్ ఇన్ యాప్ లో బ్లాక్ చైన్ స్టార్టర్ వ్యవస్థాపకుడిగా చెప్పుకొంటున్నాడు.వీరిద్దరిపై మనీలాండరింగ్ కు పాల్పడేందుకు కుట్ర పన్నడం, అమెరికాను మోసగించేందుకు ప్రయత్నించడం వంటి అభియోగాలున్నాయి.