యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి లో నేడు సీఎం కెసిఆర్ సభ నేపథ్యంలో వలిగొండ మండల కేంద్రం లో డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు.కెసిఆర్ పర్యటన ను అడ్డుకుంటామన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని స్టేషన్ కి తీసుకెళ్తుండగా వలిగొండ ప్రధాన రహదారి పై పోలీస్ వాహనానికి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుగా నిలబడి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పోలీస్ వాహనానికి అడ్డుగా ఉన్న కాంగ్రెస్ కార్య కర్తలను పక్కకు జరిపి పోలీసులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని స్టేషన్ కి తరలించారు.
తమను అరెస్ట్ చేయటం అప్రజాస్వామికం అని అన్నారు.
స్థానిక సంస్థలకు సీఎం కెసిఆర్ ఇస్తా అన్న నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంఛార్జ్ బీర్ల అయిలయ్య సహా ఎంపీపీ, మండల పార్టీ, టౌన్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ లీడర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
.