రామానుజా చార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎం శ్రీ వైఎస్ జగన్‌ను ఆహ్వనించిన త్రిదండి చినజీయర్ స్వామి. చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం శ్రీ వైఎస్ జగన్.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఇందులో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలు.
చినజీయర్ స్వామితో పాటు ముఖ్యమంత్రిని కలిసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు.