సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లను చాలా బాగా రాసుకుంటారు.ఆ క్యారెక్టర్ల వల్ల సినిమా ఎలా ఉన్నా సరే దానికి మంచి పేరు వస్తుంది.ఆ రోల్స్‌లో చేసిన నటులు చూపించే ఇంపాక్ట్ ప్రేక్షకులపై పర్మినెంట్ ఇంపాక్ట్ చూపిస్తారు.“అబ్బా ఏం నటించార్రా బాబు ఆ ఒక్క నటుడి యాక్షన్ కోసమైనా సినిమా చూడొచ్చు.” అని ప్రేక్షకులు అంటుంటారు.ఆ పాత్రలను వాళ్లు తప్ప అంత గొప్పగా ఎవరూ పోషించలేరు.అలాంటి కొన్ని పాత్రలు, వాటిని అద్భుతంగా పోషించిన యాక్టర్ల గురించి తెలుసుకుందాం.
• ఈగ – సుదీప్ – విలన్ క్యారెక్టర్
2012లో విడుదలైన ఫాంటసీ యాక్షన్ మూవీ ఈగ( Eega Movie ) బ్లాక్ బస్టర్ హిట్ అయింది.S.S.రాజమౌళి డైరెక్ట్ చేశాడు.నేచురల్ స్టార్ నాని హీరోగా, సమంత హీరోయిన్‌గా నటించాడు.
వీళ్లిద్దరూ అగ్ర నటులు అని చెప్పుకోవచ్చు.వీరు ఏ సినిమాలో నటించినా నటనలో వారిదే పై చేయి అవుతుందని చెప్పుకోవచ్చు.
కానీ ఈగ సినిమాలో మాత్రం అలా జరగలేదు.దీంట్లో విలన్ సుదీప్‌గా( Sudeep ) యాక్ట్ చేసిన కిచ్చా సుదీప్ అదరగొట్టేసాడని చెప్పాలి.
సాధారణంగా ఈ సినిమాలో మనకి కనపడుతుంది కానీ యాడ్ చేసేటప్పుడు మాత్రం కనిపించదు.
ఈగ లేకపోయినా అది ఉన్నట్టుగానే సుదీప్ చాలా పర్ఫెక్ట్ గా నటించి వావ్ అనిపించాడు.
అతను కనిపించిన ప్రతి సీన్ కూడా ఒక మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు అలాగే ప్రతి నాయకుడిగా అతను ప్రేక్షకులలో వణుకు పుట్టించాడు.పేరుకే ఇది నాని( Nani ) సినిమా కానీ ఈ మూవీలో కిచ్చా సుదీపే బాగా హైలైట్ అయ్యాడు.
అతని క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు.రాజమౌళి ఈ నటుడిలోని మొత్తం నటనా నైపుణ్యాన్ని పిండుకున్నాడు.
• వేదం మూవీ – కేబుల్ రాజు – అల్లు అర్జున్
బన్నీ తన కెరీర్‌లో పోషించిన బెస్ట్ క్యారెక్టర్స్‌లో కేబుల్ రాజు క్యారెక్టర్( Cable Raju Character ) ఒకటి.అతను స్టార్ హీరో అయినప్పటికీ సాధారణ కేబుల్ ఆపరేటర్‌గా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.మురికివాడలో నివసించే వ్యక్తిగా బన్నీ నటించడం అప్పట్లో చాలామందికి షాక్ ఇచ్చింది.అయినా ఈ క్యారెక్టర్ చేసినందుకు బన్నీ( Bunny ) చేయి చాలా మంచి పేరు వచ్చింది.
మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీతో ఈ సినిమా వచ్చింది ఇందులో చాలా నిజాలను ఎమోషనల్ గా చూపించారు.లైఫ్ లైసెన్స్ నేర్పించే ఈ సినిమాలో అనుష్క శెట్టి వేశ్య పాత్ర వేసింది.
అలాగని ఆమె చీప్ కాలేదు.అంత గొప్ప క్యారెక్టర్ అది.స్టార్డమ్ పక్కనపెట్టి బన్నీ చేసిన కేబుల్ రాజు కూడా చాలామందికి నచ్చేసింది.ఈ పాత్రకు బన్నీ తప్ప మరేవరూ న్యాయం చేయలేరు అని చెప్పుకోవచ్చు.
• విశాఖ ఎక్స్‌ప్రెస్
“విశాఖ ఎక్స్‌ప్రెస్”( Visakha Express Movie ) థ్రిల్లర్ మూవీలో అల్లరి నరేష్, రాజీవ్ కనకాల, ప్రీతి ఝాంగియాని, సింధు తులాని మెయిన్ రోల్స్ నటించారు.ఇందులో రవి వర్మ క్యారెక్టర్‌ను చాలా గొప్పగా పోషించి ఆకట్టుకున్నాడు అల్లరి నరేష్.
• నేను
రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ నేను (2004)లో( Nenu ) అల్లరి నరేష్,( Allari Naresh ) వేద అర్చన నటించారు.ఇందులో సైకోటిక్ లవర్ గా నరేష్ చాలా బాగా నటించాడు.అతను పోషించిన అన్ని పాత్రల్లో ఈ వినోద్ పాత్ర చాలా హైలెట్ అయ్యింది.దీన్ని అతను తప్ప మరెవరు కూడా అంతా గొప్పగా పోషించలేరేమో అనిపించింది.