రోజంతా అధిక పని ఒత్తిడి వల్ల, రాత్రి సమయంలో తొందరగా పడుకోవడానికి ఇష్టపడుతుంటారు.అయితే కొందరిలో రాత్రి సరిగా నిద్ర లేకపోవడం వల్ల మన మొహం పేలాగా మారిపోతుంది.
కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి.తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉంటారు.
ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే, మనం పడుకోవడానికి అరగంట ముందు మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, సెల్ ఫోన్, లాప్టాప్ వంటి వాటిని దూరంగా ఉంచడం, మన గదిని శుభ్రంగా ఉంచుకోవడం, ఇష్టమైన మ్యూజిక్ లేదా పాటలు వింటూ ఉండడం వంటి చేయడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అమ్మాయిలు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే పడుకునే ముందు వారి మేకప్ మొత్తం శుభ్రం చేసుకుని పడుకోవాలి.
మేకప్ అలాగే ఉంచుకొని పడుకోవడం వల్ల, మొహం మీద మచ్చలు ఏర్పడటమే కాకుండా, చర్మం మొత్తం ముడతలు పడి డ్రై గా మారుతుంది.మనం పడుకునే గది ఉష్ణోగ్రతలను సక్రమంగా ఉండేలా చూసుకోవాలి.
గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా లేదా చాలా తక్కువగా ఉన్నా నిద్రపోవడానికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.అందువల్ల ఉష్ణోగ్రతలను సాధారణ స్థితిలో ఉండటం వల్ల నిద్ర పడుతుంది.
బాగా నిద్ర పోవడం వల్ల పగలంతా కలిగిన ఒత్తిడి నుంచి విముక్తి పొందడమే కాకుండా మెదడు పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది.
రాత్రి పడుకునే సమయానికి ముందు ఒక పది నిమిషాల పాటు వ్యాయామం చేయడం ఎంతో శ్రేయస్కరం.
ఇది మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి ఎంతో మంచిది.పడుకునే ముందు మనసును, శరీరానికి రెండింటికీ విశ్రాంతి తీసుకోవలసిన సమయం కాబట్టి, పడుకునే ముందు వ్యాయామం చేయడం మంచిది.
పడుకునే ముందు రాబోయే రేపటి కోసం కొంత సమయాన్ని కేటాయించడం ఎంతో ముఖ్యం.మరుసటి రోజు ఏ పనులు చేయాలి వాటిని ఎలా ఎదుర్కోవాలో వంటి వాటి గురించి ముందుగానే ఆలోచించాలి.
అలాగే నిద్ర పోయేటప్పుడు వెల్లకిలా పడుకోవడం ఎంతో మంచిది.దీనివల్ల వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.