మ్యాచ్ ఫలితాలను కీలక మలుపు తిప్పిన ఇంపాక్ట్ ప్లేయర్స్ వీళ్లే..!

ఐపీఎల్ సీజన్లో ఇంపాక్ట్ రూల్( Impact Player Rule ) కొత్తగా వచ్చింది.అయితే ఈ సీజన్లో ఈ రూల్ మ్యాచ్ ఫలితాలను తలకిందులు చేసింది.

 These Are The Impact Players Who Changed The Outcome Of The Match Details, Impac-TeluguStop.com

ఓడిపోయే మ్యాచ్ గెలవడం.గెలిచే మ్యాచ్ ఓడిపోవడం స్పష్టంగా కనిపించింది.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ క్రికెట్ కు కొత్త గుర్తింపు తీసుకువచ్చింది.ఆ కోవకు చెందిన ఇంపాక్ట్ ప్లేయర్ల గురించి తెలుసుకుందాం.

వెంకటేష్ అయ్యర్:

ఐపీఎల్ 13 వ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ – కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగింది.ఈ మ్యాచ్ లో రింకూ సింగ్ చివరి ఓవర్ లో వరుసగా ఐదు సిక్సులు కొట్టి కోల్ కత్తా కు విజయం అందించాడు.

అయితే ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్( Venkatesh Iyer ) 40 బంతుల్లో 83 పరుగులు చేసి కోల్ కత్తా విజయానికి కారణం అయ్యాడు.

టిమ్ డేవిడ్:

ఐపీఎల్ 16వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ -ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది.ఈ మ్యాచ్ 19వ ఓవర్లో టిమ్ డేవిడ్ తో( Tim David ) కలిసి కామెరున్ గ్రీన్ మొత్తం 15 పరుగులు చేశాడు.ఆ తరువాత 20వ చివరి బంతికి రెండు పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

అంబటి రాయుడు:

ఐపీఎల్ 12వ మ్యాచ్ ముంబై – మధ్య జరిగింది.ఈ మ్యాచ్ లో ముంబై పై 16 బంతుల్లో 20 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.చెన్నై గెలుపుకు ఇదే కీలకంగా మారింది.

సుయాష్ శర్మ:

ఐపీఎల్ 9 వ మ్యాచ్ కోల్ కత్తా -బెంగళూరు మధ్య జరిగింది.తొలి మ్యాచ్ ఆడిన సుయాష్ 30 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.

ధ్రువ్ జురెల్:

ఐపీఎల్ 8వ మ్యాచ్ లో రాజస్థాన్ ఐదు పరుగుల తేడాతో ఓడింది.కానీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ధ్రువ్ జురెల్ 15 బంతుల్లో 32 పరుగులు చేశాడు.ఐపీఎల్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube