అయ్యయ్యో.. కొత్త కారుకి పూజ చేసిన ఓనర్.. కానీ వెంటనే అదుపుతప్పి..

ఎవరైనా సరే కొత్త వాహనం కొంటే షోరూం నుండి బయటకు తీసుకువస్తే నేరుగా దేవాలయాలకు వెళ్లి వాటికి పూజ చేసేవారు చాలామంది ఉన్నారు.ఇందులో భాగంగానే తాజాగా ఓ వ్యక్తి కొత్త కారు( New car ) కొని గుడిలో పూజలు నిర్వహించారు.

 The Owner Who Worshiped The New Car But Immediately Lost Control, Viral Video, S-TeluguStop.com

అయితే అనుకోని కారణం చేత అదుపుతప్పిన ఆ కారు ఆలయంలోని స్తంభాన్ని ఢీ కొట్టడంతో ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది.అయితే ఇక్కడ అదృశ్యం ఏమిటంటే.

కొత్త కారుకు పూజ చేసిన యజమాని మాత్రం సురక్షితంగా బయటపడడమే.ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

సుధాకర్( Sudhakar ) అనే వ్యక్తి కొత్తగా ఓ కారును కొన్నాడు.శ్రీముష్ణం( Shrimushnam ) ప్రాంతంలోని ఓ ఆలయంలో కొత్త వాహనానికి పూజలు చేయించాడు.అయితే డ్రైవింగ్ సీట్ లో ఉన్న సుధాకర్ బయట ఉన్న ఓ వ్యక్తితో మాట్లాడుతున్న సమయంలో పూజలు నిర్వహించిన తర్వాత కారును నడిపేందుకు అతడు ప్రయత్నించాడు.కాకపోతే ఆ సమయంలో బ్రేకులు వేయపోయి యాక్సిలెటర్ ను తొక్కడంతో కారు అదుపుతప్పి గుడిమెట్ల మీదుగా ముందుకు దూసుకెళ్లింది.

ఆ సమయంలో కారును కంట్రోల్ చేసేందుకు ఓ వ్యక్తి తీవ్రంగా శ్రమించిన ఫలితం తగ్గలేదు.దాంతో ఆలయం మరోవైపు ఉన్న ప్రాంగణంలోని స్తంభాన్ని కారు ఢీకొట్టింది.

ఈ హఠాత్పరిమాణంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది.కారు యజమాని సుధాకర్ కు మాత్రం ఎలాంటి ప్రమాదానికి గురి అవ్వకుండా సురక్షితంగా బయటపడ్డాడు.అయితే ఈ సంఘటనతో కొత్త కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేయబడుతున్నారు.మరోవైపు పూజ సమయంలో సిసిటీవీలో రికార్డు అయిన వీడియో క్లిప్ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.ప్రస్తుతం సిసిటీవీలో రికార్డు అయిన వీడియో క్లిప్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube