అత్యంత ఖరీదైన పెన్ను.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయి

చాలా మందికి ఖరీదైన పెన్నులను( Costly Pens ) వినియోగించడం ఇష్టం.చిన్నతనంలో చాలా మంది రేనాల్డ్స్ పెన్ వాడడాన్ని చాలా గౌరవంగా భావించే వారు.

 The Most Expensive Pens In The World,most Expensive Pens,xpensive Pens,fulgor No-TeluguStop.com

ఇవే కాకుండా గెజిటెడ్ ఆఫీసర్లు, పెద్ద స్థాయిలో ఉన్న వారు ఇంక్ పెన్నులు వాడుతుండే వారు.అలాంటి పెన్నులు తాము సైతం వాడాలని చాలా మంది భావించే వారు.

అయితే కొన్ని పెన్నుల రేటు అధికంగా ఉంటుంది.ఎంత అంటే మనం కొనలేనంత.చాలా మంది రూ.100 నుంచి రూ.500ల లోపు పెన్నులను కొని చాలా అపురూపంగా భావిస్తారు.పియరీ కార్డన్, పార్కర్ పెన్నులు వంటివి రూ.300ల నుంచి రూ.2000ల వరకు ఉంటాయి.ఇవే కాకుండా కొన్ని ప్రీమియం పెన్నులు కూడా ఉంటాయి.వాటిని కేవలం చాలా తక్కువ మంది కొనగలరు.అయితే కనీసం లక్షాధికారులు, గెజిటెడ్ ఆఫీసర్లు సైతం కొనలేని పెన్నులు ఉంటాయని మీకు తెలుసా? అది నిజం.వాటి ధర ఏకంగా కోట్లలో ఉంది.

దీనికి సంబంధించిన విషయాలిలా ఉన్నాయి.

Telugu Aurora Diamante, Boheme Royal, Expensive Pens, Xpensive Pens-Latest News

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెన్నుల గురించి తెలుసుకుందాం.ఈ జాబితాలో ఫుల్గోర్ నాక్టర్నస్ పెన్ను( the Fulgor Nocturnus ) తొలి స్థానంలో ఉంది.దీని ధర ఎంతో తెలుసా? అక్షరాలా 8 మిలియన్ డాలర్లు.అంటే భారత కరెన్సీలో రూ.65 కోట్ల కంటే ఎక్కువ.షాంఘైలో 2010లో దీనికి వేలం నిర్వహించారు.దీనికి గరిష్టంగా 8 మిలియన్ డాలర్ల ధర పలికింది.దీనిని బంగారం, నలుపు రంగు వజ్రాలతో రూపొందించారు.

Telugu Aurora Diamante, Boheme Royal, Expensive Pens, Xpensive Pens-Latest News

దీని తర్వాతి స్థానాన్ని బోహెమ్ రాయల్ పెన్( Boheme Royal Pen ) దక్కించుకుంది.దీనిని మోంట్బ్లాంక్ అనే ఖరీదైన పెన్నులను తయారు చేసే కంపెనీ రూపొందించింది.18 క్యారెట్ల బంగారంతో దీనిని తయారు చేశారు.పెన్ను పై భాగంలో ఖరీదైన వజ్రాలు రూపొందించారు.దీని ధర 1.5 మిలియన్ డాలర్లు.భారతీయ కరెన్సీలో దీని విలువ రూ.12 కోట్లుగా నిపుణులు చెబుతున్నారు.

Telugu Aurora Diamante, Boheme Royal, Expensive Pens, Xpensive Pens-Latest News

ఇక మూడో స్థానంలో అరోరా డైమంటే( Aurora Diamante ) పెన్ను ఉంది.దీనిని కూడా ఖరీదైన 30 క్యారెట్ల వజ్రాలతో పాటు బంగారం, ప్లాటినంతో తయారు చేశారు.దీనిని రూ.1.28 మిలియన్ డాలర్ల ధరగా నిర్ణయించారు.అంటే భారత కరెన్సీలో దీని ధర రూ.10 కోట్ల కంటే చాలా ఎక్కువ.ఈ జాబితాలో 1010 డైమండ్స్ లిమిటెడ్ ఎడిషన్ ఫౌంటెన్ పెన్ కూడా ఉంది.దీనిని 18 క్యారెట్ల బంగారంతో పాటు మేలిమి వజ్రాలతో రూపొందించారు.దీని విలువ ఒక మిలియన్ డాలర్లు.అంతే భారత కరెన్సీలో దీనిని కొనాలంటే రూ.8 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube