ఆ పెద్ద స్టేడియం కూల్చేయాలని ప్రభుత్వం నిర్ణయం.. ఎందుకంటే!

ఇండోనేషియాలోని కంజురుహాన్‌ ఫుట్‌బాల్‌ స్టేడియంలో తొక్కిసలాట జరిగి 133 మంది మరణించిన విషయం తెలిసిందే.ఇంత పెద్ద విషాదానికి దారి తీసిన ఈ ఫుట్​బాల్ స్టేడియాన్ని కూల్చివేయాలని ఇండోనేషియా ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది.

 The Government's Decision To Demolish That Big Stadium.. Because! Football, Indo-TeluguStop.com

ఇందులో భద్రత తక్కువగా ఉందని, ఫిఫా ప్రమాణాలు లేవని పేర్కొంటూ దీనిని కూల్చివేసేందుకు ఇండోనేషియా సిద్ధమైంది.దీనికి బదులుగా నిర్మించనున్న కొత్త స్టేడియంలో ఆడియన్స్, ప్లేయర్ల భద్రతకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్లాన్ చేస్తోంది.

ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మంగళవారంనాడు మాట్లాడుతూ ఈ కీలక ప్రకటన ప్రకటన చేశారు.ఈ స్టేడియాన్ని కూల్చివేసి కొత్త ఫుట్‌బాల్‌ స్టేడియం తీసుకొస్తామని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా ఇండోనేషియాలో 2023లో అండర్-20 ఫుట్‌బాల్‌ వరల్డ్ కప్ కండక్ట్ చేయనున్నారు.ఈ కొత్త స్టేడియం ఎంత సమయంలో నిర్మిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

ఇకపోతే అక్టోబర్ 1న కంజురుహాన్‌ ఫుట్‌బాల్‌ స్టేడియంలో ప్రేక్షకులు ఒకరికొకరు తోసుకుంటూ తొక్కిసలాటకు పాల్పడ్డారు.ఈ ఘటనలో 133 మంది అశువులు బాశారు.

దాంతో అక్టోబర్ 1 ఫుట్‌బాల్‌ చరిత్రలో అత్యంత చీకటి రోజుల్లో ఒకటిగా మారింది.

Telugu Football, Indonesia-Latest News - Telugu

మళ్లీ ఇంత ఘోరమైన ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని భద్రతా నిబంధనలను పాటించడానికి ఇండోనేషియా ప్రభుత్వం నడుం బిగించింది.మ్యాచులు నిర్వహించే విషయంలో కూడా మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకుంది.కాగా ఇప్పుడు ఇండోనేషియాలో ఉన్న ఫిఫా, ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య ప్రతినిధులు అక్టోబర్ 1న జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు.

అప్పటి వరకు తాత్కాలికంగా అన్ని ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు ఆపేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube