ఈ మధ్య కాలంలో వరుసగా బుల్లితెర నటీనటులు, మోడల్స్ ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఈ విధంగా ఒక ఘటన మరిచిపోకముందే మరొకరు ఆత్మహత్య చేసుకొని అందరికీ షాక్ ఇస్తున్నారు.
తాజాగా మరక బుల్లితెర నటి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు.ఈమె ఆత్మహత్య అందరిని ఆందోళనకు గురి చేస్తోంది.
ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీ రేఖ ఓజా జూన్ 18వ తేదీ ఆత్మహత్యకు పాల్పడ్డారు.భువనేశ్వర్‌లోని గదసాహీ ప్రాంతానికి సమీపంలోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్న రష్మీ రేఖ ఉరివేసుకొని దారుణానికి పాల్పడ్డారు.
ఇంటి యజమాని సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఈమె ఆత్మహత్య చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది.పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించగా అక్కడ సూసైడ్ నోట్ లభించింది.
అందులో తన మరణానికి ఎవరూ కారణం కాదని రాయడమే కాకుండా ఐ లవ్ యూ సాన్ అని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.అయితే ఈమె ఆత్మహత్య వెనుక ప్రేమే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.23 సంవత్సరాల రష్మీ గత కొంతకాలం నుంచి సంతోష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది.

ఈ క్రమంలోనే రష్మీ మరణానికి సంతోష్ కారణం అయి ఉండవచ్చని రష్మి తండ్రి అనుమానం వ్యక్తం చేశారు.శనివారం సాయంత్రం రష్మికి ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయలేదు కొంత సమయానికి సంతోష్ ఫోన్ చేసి రష్మి చనిపోయిందనే సమాచారం అందించారు.ఇలా వీరిద్దరూ కలిసి ఉంటున్న సంగతి ఇంటి యజమాని మాకు చెప్పే వరకు తెలియదని రష్మీ తండ్రి ఈ సందర్భంగా తెలియజేశారు.
జగత్సింగ్పూర్ జిల్లాకు చెందిన రష్మీ ‘కెమిటి కహిబి కహా’ అనే సీరియల్ తో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఇలా ఈమె నటిగా గుర్తింపు పొందిన అనంతరం ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోంది.