తెలంగాణ అంటే ఒక భావోద్వేగమని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.రాచరికపు ఆనవాళ్లు ఉండకూడదన్నదే తమ విధానమని పేర్కొన్నారు.
అందుకే రాష్ట్ర అధికారిక చిహ్నం కూడా మారుస్తామని తెలిపారు.ప్రజా పరిపాలన అందిస్తూ ముందకుకెళ్తున్నామని పేర్కొన్నారు.
జయజయహే తెలంగాణ గీతం ( Jayajayahe Telangana song )రాష్ట్రీయ గీతంగా మారుతుందన్నారు.ఉద్యమ స్ఫూర్తితో జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆమోదించామని తెలిపారు.
మేం తీసుకున్న నిర్ణయాలను ప్రతిపక్షం అభినందిస్తుందనుకున్నామన్న రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత సూచనలు, సలహాలు ఇస్తారని అనుకున్నామని పేర్కొన్నారు.ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు.కానీ తమ ప్రభుత్వంలో మొదటి నెల 4వ తేదీలోపే జీతభత్యాలు వేశామని స్పష్టం చేశారు.ఈ సారి మొదటి తారీఖునే జీతభత్యాలు ఉద్యోగులకు అందిస్తామని వెల్లడించారు.