బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ముద్దాడిన భారత జట్టు.. పట్టలేని ఆనందంలో రోహిత్ సేన..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో( Border Gavaskar trophy ) భాగంగా ఆస్ట్రేలియా- భారత్ మధ్యన 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భారత్ 2-1 తో భారత్ ఘన విజయం సాధించింది.భారత జట్టుకు ట్రోఫీ సొంతం కావడంతో రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ సిరీస్ గెలవడం కోసం ఆటగాళ్లు తీవ్రంగా కష్టపడ్డారని తెలిపాడు.

 Team India Win The Border Gavaskar Trophy , Team India , Border Gavaskar Tro-TeluguStop.com

ఇక పోతే 2017, 2018 -19, 2020-21, 2023 సిరీస్ లను భారత్ వరుసగా సొంతం చేసుకుంది.భారత జట్టులోని ప్రతి ఆటగాడు అద్భుత ఆటను ప్రదర్శించడం వలన ఈ సిరీస్ లొ విజయం సాధించామని రోహిత్ శర్మ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

టెస్ట్ క్రికెట్ అంటే అన్ని ఫార్మాట్లో కంటే చాలా కష్టమైనది.టెస్ట్ ఫార్మాట్ లో రాణించడం చాలా కష్టంతో కూడుకున్న పని.ఈ సిరీస్ పై తాను పెట్టుకున్న ఆశలు ఫలించాలని, ఈ విజయం తనకు పట్టలేని సంతోషాన్ని ఇచ్చిందని తెలిపాడు.

Telugu Australia, Gavaskar Trophy, Latest Telugu, Rohit Sharma, India, Virat Koh

మొదటి రెండు మ్యాచ్లలో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఇక మూడవ మ్యాచ్లో కాస్త తడబడి ఓడిన సంగతి తెలిసిందే.ఇదే క్రమంలో నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకొని బరిలోకి దిగింది.

ఇక మ్యాచ్ ప్రారంభం నుండి ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతుంటే, భారత జట్టు విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది.

Telugu Australia, Gavaskar Trophy, Latest Telugu, Rohit Sharma, India, Virat Koh

మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 480 పరుగులు చేస్తే, భారత్ 571 పరుగులు(Team india) చేసి అల్ ఔట్ అయింది.కోహ్లీ 186 పరుగులు(Virat Kohli), శుబ్ మన్ గిల్ 128 పరుగులు నమోదు చేశారు.రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు లో ట్రావిస్ హెడ్ 90 పరుగులు చేసి, అక్షర్ పటేల్ చేతిలో అవుట్ అయ్యాడు.

మార్నస్ లబుషేన్ 63 నాట్ అవుట్.స్టీవ్ స్మిత్ 10 నాట్ అవుట్.అయితే మ్యాచ్ ఫలితం తేలే పరిస్థితులు అర్థం కాక ఇరుజట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.ఇక రోహిత్ సేన విషయానికి వస్తే, కెప్టెన్ గా రోహిత్ శర్మ(Rohit Sharma)కు ఇదే డ్రా అయిన తొలి మ్యాచ్.

రోహిత్ శర్మ తన కెరీర్లో ఆరు టెస్ట్ మ్యాచ్లకు కెప్టెన్ గా సారథ్యం వహించాడు.తొలి నాలుగు టెస్టులలో విజయాలు, ఇండోర్ లో జరిగిన మూడో టెస్ట్ లో తొలి పరాజయాన్ని పొందాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube