ట్రంప్ కి ఉపాధ్యాయ సంఘాల హెచ్చరిక..ఎందుకంటే..!!

అమెరికాలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ట్రంప్ ఏ పని తలపెట్టినా అది రివర్స్ లో తిప్పి కొడుతోంది.ప్రజా యోజన కార్యక్రమాలు సైతం ట్రంప్ కి వ్యతిరేకంగా మారిపోతున్నాయి.

 Teachers Community Angry On Trump Over Schools Re Open Issue,new York Federation-TeluguStop.com

కరోనా మహమ్మారి అమెరికాలో రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్న క్రమంలో రోజుకి వందలాది మంది మృతి చెందుతున్నారు.వేలాది మంది కరోనా బారిన పడుతున్నారు.

ఈ క్రమంలో పలు కంపెనీలు, ఫ్యాక్టరీలు తెరవాలని గతంలో ట్రంప్ పట్టుబడితే మూకుమ్మడి సమ్మెకి దిగి మా ప్రాణాలకి రక్షణ ఇవ్వండి విదులకి వెళ్తాం అంటూ ధర్నాలు చేశారు.

తాజాగా ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి.

స్కూల్స్ ప్రారంభించాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేయడంతో ఉపాధ్యాయ సంఘాలు అన్నీ సంఘటితం అయ్యాయి.కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా స్కూల్స్ ఒపెన్ చేయడం వలన పిల్లలు కరోనా బారిన పడితే నష్టం ఎవరికి జరుగుతుందని మండిపడ్డారు.

మీ విధానాలు ఇలాగే ఉంటే మేము సమ్మెకి దిగక తప్పదని న్యూయార్క్ యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ ఈ మేరకు ట్రంప్ కి హెచ్చరికలు జారీ చేసింది.

Telugu America, Corona, Donald Trump, York Teachers, Schools-

స్కూల్స్ ప్రారంభించాలని ఒత్తిడి చేస్తే తాము కేసులు పెట్టేందుకు కూడా వెనకడుగు వేయమని తెలిపింది.కొన్ని రోజుల క్రితం అమెరికాలో ఓ స్కూల్ ప్రారంభించిన తొలి రోజునే కరోనా పాజిటివ్ నమోదైన విద్యార్ధి వచ్చాడని, అతడి కారణంగా అదే స్కూల్ లో దాదాపు 100 మంది విద్యార్ధులకి కరోనా సోకిందని గుర్తు చేసింది.ఇదిలా ఉంటే న్యూయార్క్ యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ అసోసియేషన్ లో మొత్తం 1.33 వేల మంది ఉపాధ్యాయులు సభ్యులుగా ఉండగా వారందరూ సమ్మెకి దిగితే ఒక్క స్కూల్ కూడా తెరుచుకునే అవకాశం లేదని అంటున్నారు పరిశీలకులు.అయితే ఇప్పటికే రాజకీయంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న ట్రంప్ కి ఈ పరిణామాలు మరో తలనొప్పిగా మారాయని చెప్పడంలో సందేహం లేనేలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube