సజ్జల రామకృష్ణారెడ్డి పై మండిపడ్డ టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల ..!!

టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్( kanakamedala Ravindra Kumar ) ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై( Sajjala Ramakrishna Reddy ) మండిపడ్డారు.స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకి( Chandrababu Naidu ) ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్  మంజూరు చేయడం తెలిసిందే.

 Tdp Rajya Sabha Member Kanakamedala Angry With Sajjala Ramakrishna Reddy Details-TeluguStop.com

ఈ విషయంలో సజ్జల చేసిన వ్యాఖ్యలను కనకమేడల ఖండించారు. కోర్టు తీర్పును పక్కదారి పట్టించే విధంగా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు.

సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. స్కిల్ కేసు పెట్టిన రెండు సంవత్సరాల తర్వాత… చంద్రబాబుపై కేసు పెట్టారు.

కోర్టులో సాక్ష్యాలు చూపించలేదు.రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశారు.

వైసీపీ నాయకులకు న్యాయస్థానాల తీర్పును గౌరవించే సంస్కృతి లేదు.కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారు.మీడియా ముందుకు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలేనని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల వ్యాఖ్యానించారు.ఈ కేసులో చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని.కోర్టు చెప్పినప్పటికీ, షెల్ కంపెనీలకు డబ్బు వెళ్లిందని సజ్జల అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలుగుదేశం పార్టీకి సభ్యత్వాలు రూపంలో వచ్చిన విరాళాలను కూడా ఈ కేసుతో ముడి పెట్టడం దారుణమని అన్నారు.

కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబుని కేసుల్లో ఇరికించారని విమర్శించారు.ఇదే సమయంలో జగన్ కేసులపై కూడా సజ్జల మాట్లాడాలని కనకమేడల సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube