ఏపీలో ఎన్నికల సమయం ముంచుకు వచ్చేయడంతో జనాల బాట పట్టేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు.అన్ని పార్టీలు ఎన్నికల హడావుడిలోనే ఉన్నాయి.
ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంది.ఇప్పటికే జనసేన పార్టీ( Janasena party )తో పొత్తును ఖరారు చేసుకుంది.
ఇక ముందు ముందు మరింత దూకుడు ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు.
వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను జనాల్లోకి తీసుకువెళ్లేందుకు టిడిపి అదినేత చంద్రబాబు( Chandrababu Naidu ) సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు జనాల్లోకి వెళ్ళేందుకు భారీగా బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.జనవరి 5 నుంచి 29 వరకు మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.ఈ సభలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు.
ఈనెల 18వ తేదీ మినహా మిగిలిన అన్ని రోజుల్లో సభలు నిర్వహించే విధంగా షెడ్యూల్ ను రూపొందించారు.ప్రతిరోజు రెండు సభలు నిర్వహించే ప్లాన్ చేశారు.
ఈ సభలకు రా కదలిరా అనే పేరు పెట్టారు.ఇదే పేరుతోనే అన్ని సభలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.ప్రతి సభ చంద్రబాబు ఆధ్వర్యంలోనే జరగనున్నాయి.దీంతోపాటు కొన్ని కొన్ని సభలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.జనవరి 5 కనిగిరి, జనవరి 6 తిరువూరు , ఆచంట, జనవరి 9 వెంకటగిరి ,ఆళ్లగడ్డ, జనవరి 10 బొబ్బిలి, తుని, జనవరి 18 గుడివాడ, జనవరి 19 గంగాధర నెల్లూరు, కమలాపురం, జనవరి 20 అరకు, మండపేట.జనవరి 24 పీలేరు, ఉరవకొండ.
జనవరి 25 కోవూరు, పత్తికొండ.జనవరి 27 గోపాలపురం, పొన్నూరు.
జనవరి 28 మాడుగుల ,టెక్కిలి .జనవరి 29 ఉంగుటూరు , చీరాల నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ఉండబోతున్నట్లు టిడిపి ప్రకటించింది
.