జూనియర్ ఎన్టీఆర్ ఫొటో పట్టుకున్నందుకు అభిమానులపై టీడీపీ నేత నారా లోకేశ్ ( Nara Lokesh )సైన్యం దౌర్జన్యానికి దిగింది.దీంతో దివంగత నేత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కు విలువ కూడా ఇవ్వడం లేదని ఏపీ ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
చంద్రబాబు, లోకేశ్ తీరుపై మండిపడుతున్నారు.ఎన్టీఆర్ అభిమానులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడటం సరికాదని చెబుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ ఆధ్వర్యంలో ‘ రా కదలి రా’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే.ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో ఉండాలని భావించిన చంద్రబాబు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా తిరువూరు, ఆచంటలో( Tiruvuru, Achanta ) బహిరంగ సభలను నిర్వహించారు.అయితే ఈ సభా ప్రాంగణానికి టీడీపీ కార్యకర్తలతో పాటు అభిమానులు సైతం తరలివచ్చారు.
వీరిలో కొందరు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఫ్లెక్సీలతో హాజరయ్యారు.జై ఎన్టీఆర్ అంటూ వారు నినాదాలు చేయడంతో చంద్రబాబు( Chandrababu ) ఎదురుగానే నారా లోకేశ్ సైన్యం వారిపై దాడికి పాల్పడిందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ అభిమానులు తీసుకొచ్చిన ఫ్లెక్సీలను, జెండాలను సైతం లాక్కుని వీరంగం సృష్టించారు.అనంతరం వారిని అక్కడి నుంచి తరిమేశారని సమాచారం.

సాధారణంగా టీడీపీకి సంబంధించి ఏ సభ జరిగినా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు( Junior NTR flexes ) కనిపిస్తూనే ఉంటాయి.ఎన్టీఆర్ టీడీపీలో బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటున్న వారిలో పార్టీ శ్రేణులతో పాటు కొందరు అభిమానులు కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే.గతంలో హరికృష్ణ జీవించి ఉన్న సమయంలో ఎన్టీఆర్ పార్టీలో కొంత యాక్టివ్ గా ఉన్నప్పటికీ తరువాత ఆయన పార్టీకి దూరంగా వెళ్లారు.
అయితే తరచూ టీడీపీ సభలు, సమావేశాల్లో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు దర్శనమిస్తూనే ఉంటాయి.తాజాగా చంద్రబాబు నిర్వహించిన సభలో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించడం, దీంతో అభిమానులపై లోకేశ్ సైన్యం దాడికి పాల్పడటం ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దివంగత నేత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ప్రస్తుతం ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్ కు ఏ మాత్రం విలువ, గౌరవం ఇవ్వడం లేదని ఈ దాడిని చూస్తేనే అర్థం అవుతుందని ఏపీ వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఒకప్పుడు ఎన్టీఆర్ సేవలను వాడుకున్న టీడీపీ క్రమంగా ఆయనను దూరంగా పెడుతూ వచ్చింది.సొంత మనవడి అభిమానులు ప్రేమతో సభకు హాజరైతే.
వారిపై విచక్షణారహితంగా దాడి చేసి సభా ప్రాంగణం నుంచి తరిమేయడంపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.టీడీపీ నేతల చర్యలు పరాకాష్టకు చేరుకున్నాయంటూ ధ్వజమెత్తుతున్నారు.