ఏపీలోని ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాజ్యసభ ఎన్నికలకు( Rajya Sabha elections ) దూరంగా ఉండనుందని తెలుస్తోంది.ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుతో పార్టీ సీనియర్ నేతలు యనమల, నిమ్మల, గొట్టిపాటి మరియు అనగాని భేటీ అయ్యారు.
దాదాపు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది.కాగా సమావేశంలో భాగంగా రానున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని నేతలు ప్రస్తావించారు.
ఈ నేపథ్యంలోనే పోటీ చేసే ఆలోచన లేదని చంద్రబాబు( Chandrababu naidu ) నాయకులకు తేల్చి చెప్పారు.రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపైనే ఎక్కువ దృష్టి సారించాలని సూచించారని సమాచారం.