తానా.ఉత్తర అమెరికా తెలుగు సంఘం.
అమెరికాలో తెలుగు వారికోసం ఏర్పాటు చేసిన అతి పెద్ద సంఘాలలో ఒకటి.ఈ తెలుగు సంస్థ.
అమెరికాలో ఉన్న తెలుగు వారికోసం వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడింది అయితే అక్కడ మాత్రమే కాముండా తెలుగు రాష్ట్రాలలో సైతం తన కార్యక్రమాలని నివహిస్తోంది.ఈ మధ్యకాలంలోనే తానా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్ని సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంది.

కడప జిల్లా రాజం పేటలోని అన్నమాచార్యుల విగ్రహ పరిసర ప్రాంతమైన ధీం పార్కుని టీటీడీ మరియు తానా కలిసి పరిశీలించారు.ఈ థీంపార్కు వద్ద తానా , టీటీడి అధికారులు కలిసి నిర్వహించే కార్యక్రమాలకు కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించేందుకు టీటీడీ అధికారులు మరియు తాన ఆధ్యక్షుడు సతీష్ వేమన కలిసి పరిశీలించారు.

అయితే ఇదే కార్యక్రమంలోనే తానా రైతులకు రక్షణ పరికరాలను కూడా పంపిణీ చేయనున్నట్టుగా తెలిపారు.టీటీడీ ఈఈ విజయలక్ష్మి రాజంపేట ఎమ్మెల్యే ,తానా అధ్యక్షుడు సతీష్ వేమన, మల్లికార్జున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.