గోవిందుడు అందరివాడేలా సినిమా విడుదల అప్పట్లో బాగా ఆలస్యం అయ్యింది.అందుకు కారణం ఏమిటో సినీజనాలకు బాగా తెలుసు .
కాని మెగాస్టార్ చిరంజీవి గురించి కామెంట్ చేయడం ఎందుకు అని అంతా సైలెంట్ గా ఉన్నారు.ఇప్పుడు, సినిమా విడుదల అయిన మూడు సంవత్సరాల తరువాత జరిగిన విషయాన్ని బయటపెట్టేసారు తమిళ సీనియర్ నటుడు రాజ్ కిరణ్.
ఇటివలే ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన రాజ్ కిరణ్, తనను గోవిందుడు అందరివాడేలే సినిమా నుంచి ఎందుకు తీసేసారో ఇప్పటివరకు చెప్పలేదని విస్మయాన్ని వ్యక్తపరిచారు.
వివరాల్లోకి వెళితే గోవిందుడు అందరివాడేలే సినిమా మొదలైనప్పుడు రామ్ చరణ్ తాత పాత్రలో నటించింది ప్రకాష్ రాజ్ కాదు, రాజ్ కిరణ్.60% షూటింగ్ పూర్తయిన తరువాత ఆయన స్థానంలోకి ప్రకాష్ రాజ్ ని తీసుకొచ్చారు.ఇలా ఎందుకు జరిగింది అంటే, దీని వెనుక మెగాస్టార్ హస్తం ఉంది.
ఈ సినిమా షూటింగ్ మధ్యలో కొన్ని రషెష్ చూసిన చిరంజీవి, ఈ సినిమాలొ హీరో ఎవరు? రామ్ చరణా లేక రాజ్ కిరణా? అని కృష్ణవంశీని ప్రశ్నించారట.రాజ్ కిరణ్ చరణ్ ని బాగా డామినేట్ చేస్తున్నారని, కథలో, పాత్రలో మార్పులు చేయమని ఆర్డర్ వేసారట.
దాంతో షూటింగ్ నిలిపివేసి కథలో, తాత పాత్రలో చాలా మార్పులు చేసి రాజ్ కిరణ్ ని సినిమాలోంచి చెప్పపెట్టకుండా తీసేసి ప్రకాష్ రాజ్ ని తీసుకొచ్చారు.
నిజానికి నిర్మాత బండ్ల గణేష్ ఇంకా రాజ్ కిరణ్ కి 10 లక్షల దాకా చెల్లించాల్సి ఉందట.
ఆ డబ్బులు కూడా ఇవ్వలేదట.పైగా, ప్రకాష్ రాజ్ అడిగినప్పుడు రాజ్ కిరణ్ కి ఎమౌంట్ పూర్తిగా సెటిల్ చేసినట్లు, ఆయన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చినట్లు అబద్ధం చెప్పారట యూనిట్ సభ్యులు.
అంతేకాదు, ఈ సినిమాకి మొదట సంగీత దర్శకుడు తమన్ .కాని తమన్ ప్లేసులోకి యువన్ శంకర్ రాజా తరువాత వచ్చారు.దీనికి కారణం తమన్ – కృష్ణవంశీ మధ్య ఏదో గొడవ జరిగిందట.సర్లేండి .ఇదంతా మనకిప్పుడు అనవసరం.