రెండు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. నటి కీలక వ్యాఖ్యలు..?

సామాన్య ప్రజలలో చాలామంది సెలబ్రిటీలు రియల్ లైఫ్ లో ఎంతో సంతోషంగా ఉంటారని వారికి ఎలాంటి కష్టాలు ఉండవని అభిప్రాయపడుతూ ఉంటారు.అయితే తెరపై కనిపించినంత అందంగా సెలబ్రిటీల నిజ జీవితాలు ఉండవు.

 Actress Swetha Tiwari Opens Her Abusive Marriages Impact Her Children , Swetha T-TeluguStop.com

నిజ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఆ కష్టాలు బయటకు కనిపించకుండా ఉండే సెలబ్రిటీలు చాలామందే ఉన్నారు.అలా నిజ జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని కష్టాలను అనుభవించిన నటీమణులలో శ్వేతా తివారీ ఒకరు.

రియల్ లైఫ్ లో రెండు పెళ్లిళ్లు చేసుకున్న శ్వేతా తివారీ వేర్వేరు కారణాల వల్ల రెండు సార్లు విడాకులు తీసుకున్నారు.శ్వేతా తివారీకి ఇద్దరు పిల్లలు కాగా ఆమె సొంతంగా పిల్లలను పోషించుకుంటున్నారు.

రెండు పెళ్లిళ్లు చేసుకోవడం విడాకులు తీసుకోవడం గురించి మాట్లాడిన శ్వేతా తివారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రియల్ లైఫ్ లో తాను రెండుసార్లు మోసపోయానని ఆ ప్రభావం తన కంటే తన పిల్లలపైనే ఎక్కువగా పడిందని ఆమె అన్నారు.

Telugu Abhinav Kohli, Impact, Palak, Raja Chowdhary, Riyan, Sweta Tiwari, Swetha

తన లైఫ్ లోకి ఇద్దరు తప్పుడు పురుషులను ఆహ్వానించడం వల్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు.పిల్లలు బాధను బయటకు తెలియకుండా ఉండటంతో పాటు గందరగోళంగా ఉంటున్నారని ఆమె పేర్కొన్నారు.తన మొదటి భర్త అయిన రాజా చౌదరి అనే వ్యక్తి ఫిజికల్ గా, మానసికంగా ఎంతో టార్చర్ చేసేవాడని ఆ కారణం వల్లే మొదటి భర్తతో విడిపోయానని శ్వేతా తివారీ అన్నారు.

ఆ తరువాత తాను అభినవ్ కోహ్లీని వివాహం చేసుకున్నానని కానీ అతనితో కూడా విడిపోయానని ఆమె అన్నారు.

కూతురు పాలక్, కొడుకు రియాన్ చిన్న వయస్సులోనే పోలీసులు, కోర్టులను చూశారని.తాను తప్పుడు వ్యక్తులను ఎంచుకోవడం వల్ల, తన పొరపాట్ల వల్ల పిల్లలు బాధ పడుతున్నారని ఆమె పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube