భాషతో సంబంధం లేకుండా తన నటనతో, స్టైల్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారు.ఏడు పదుల వయస్సులో కూడా రజినీకాంత్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.
రజినీకాంత్ నటిస్తానంటే ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనుకాడటం లేదు.ఈరోజు రజినీకాంత్ పుట్టినరోజు.
వివాదాలకు దూరంగా ఉండే హీరోగా రజినీకాంత్ కు పేరుంది.
దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నటులలో రజినీకాంత్ ఒకరు.
రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకున్నా వయస్సు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రజినీకాంత్ రాజకీయాలపై ఆసక్తి చూపలేదు.సక్సెస్ ఫెయిల్యూర్ కు అతీతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న స్టార్ హీరోలలో రజినీకాంత్ కూడా ఒకరని చెప్పవచ్చు.
రజినీకాంత్ ఆస్తుల విలువ ఏకంగా 380 కోట్ల రూపాయలు అని సమాచారం.

సినిమాల ద్వారా మాత్రమే రజినీకాంత్ ఈ ఆస్తులను సంపాదించుకున్నారు.ఎన్నో కంపెనీలు రజినీకాంత్ కు యాడ్స్ లో ఆఫర్స్ ఇచ్చినా రజినీకాంత్ మాత్రం ఆ ఆఫర్స్ పై పెద్దగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.సినిమాల ద్వారా సంపాదించిన మొత్తంలో కొంత మొత్తాన్ని రజినీకాంత్ సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు.
రజినీకాంత్ దగ్గర ప్రముఖ కంపెనీల లగ్జరీ కార్లు ఉన్నాయి.

రజినీకాంత్ కొనుగోలు చేసిన ఈ లగ్జరీ కార్ల ధర 25 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది.తన సినీ కెరీర్ లో రజినీకాంత్ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.ముత్తు, నరసింహ, చంద్రముఖి, శివాజీ, రోబో సినిమాలు నటుడిగా రజినీకాంత్ కు మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు రజినీకాంత్ కు క్రేజ్ ను పెంచాయి.
పదుల సంఖ్యలో సినిమాలకు రజినీకాంత్ బెస్ట్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకున్నారు.